Currency Notes on Road : రోడ్డుపై కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్లు..దగ్గరకెళ్లి చూస్తే షాక్

రోడ్డుపై కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్లు కనిపించటంతో వాహనదారులు షాక్ అయ్యారు. దగ్గరకెళ్లి చూసి షాక్ అయ్యారు. హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారిపై నిజామాబాద్ జిల్లాలో రోడ్డుపై కరెన్సీ

Torned Currency Notes on Road  : రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు రోడ్డు పక్కన కనిపించిన గుట్టల్ని చూసి ఆగిపోతున్నారు. కుప్పలు తెప్పలుగా కళ్లముందు కనిపిస్తున్న కరెన్సీ నోట్ల గుట్టల్ని చూసి వారి కళ్లు చెదిరిపోయాయి. దూరం నుంచి కరెన్సీ నోట్ల కుప్పను చూసి షాకయ్యారు. దగ్గరికి వెళ్లి చూస్తే..మరింత షాక్ అయ్యారు. అవి కరెన్సీ నోట్లే..కానీ కరెన్సీ నోట్ల తుక్కు.. హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారిపై నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద రోడ్డుపై గుట్టలుగా పడి ఉన్న చిరిగిన నోట్లు కలకలం రేపాయి. మెండోరా మండలం బుస్సాపూర్‌ వద్ద హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ నేషనల్ హైవేపా బుధవారం (డిసెంబర్ 29,2021) చిరిగిన కరెన్సీ (నోట్ల తుక్కు) కుప్పలుకుప్పలుగా కనిపించటంతో జనాలు షాక్ అయ్యారు. ఈ నోట్ల కట్టల తుక్కు హాట్ టాపిక్ గా మారింది.

Read more : Third Wave: సమయం లేదు.. సెకండ్ వేవ్ గురించి ముందే చెప్పిన కేంబ్రిడ్జ్ సంచలన రిపోర్ట్!

రోడ్లపై గాలికి ఆ కరెన్సీ నోట్ల ముక్కలు చుట్టుపక్కల ప్రాంతాలకు కొట్టుకుపోవడంతో కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాక జనాలు అయోమయంలో ఉండిపోయారు. స్థానికుల సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు స్పాట్‌కు చేరుకుని కరెన్సీ నోట్ల తుక్కును స్వాధీనం చేసుకున్నారు. అవి అక్కడికి ఎలా వచ్చాయి? తుక్కుగా ఎలా మారాయి? అన్న విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. నోట్ల కట్టలున్న సంచి లారీ పైనుంచి కిందపడి ఉంటుందని, దానిపై నుంచి వాహనాలు వెళ్లడంతో నోట్లన్నీ ఇలా చినిగిపోయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.

ఈ నోట్ల కట్టలు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరు ఈ పని చేస్తున్నారు? ఆ కరెన్సీ నోట్లు ఒరిజినలేనా? లేక నకిలీవా? ఒకవేళ అసలైనవే అయితే ఇలా ఎందుకు తుక్కుగా మార్చారు? అనే పలు అనుమానాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నోట్ల తుక్కు ఘటన గురిచి పోలీసు అధికారులు మాట్లాడుతూ.. రిజర్వు బ్యాంకు ఇలా చేసే అవకాశం లేదని..పాత నోట్లను రహస్య ప్రదేశంలో కాల్చివేస్తుందని బహుశా వాటిని తరలిస్తుండగా వాహనంలోంచి పొరపాటున పడిపోయి ఉండవచ్చనని తాము భావిస్తున్నామని..ఇవి బ్లాక్ మనీగానీ..నకిలీ నోట్లు కానీ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నామన్నారు. నోట్లున్న సంచి ఏ వాహనం నుంచి జారిపడిందో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

Read more : Chennai Airport : సూట్‌కేసు హ్యాండిల్‌లో రూ.5.76 కోట్ల విలువైన వజ్రాల తరలింపు..గుట్టు రట్టు చేసిన అధికారులు 

ట్రెండింగ్ వార్తలు