Chennai Airport : సూట్‌కేసు హ్యాండిల్‌లో రూ.5.76 కోట్ల విలువైన వజ్రాల తరలింపు..గుట్టు రట్టు చేసిన అధికారులు 

సూట్‌కేసు హ్యాండిల్‌లో రూ.5.76 కోట్ల విలువైన వజ్రాల తరలిస్తున్న ఓ ప్రయాణీకుడిని అధికారులు అరెస్ట్ చేశారు.

Chennai Airport : సూట్‌కేసు హ్యాండిల్‌లో రూ.5.76 కోట్ల విలువైన వజ్రాల తరలింపు..గుట్టు రట్టు చేసిన అధికారులు 

Chennai Airport

diamonds worth 1052 carats Rs 5.76 crores Chennai airport : బంగారం, వజ్రాలు అక్రమంగా తరలించటానికి ఎన్నో తెలివితేటలు ఉపయోగిస్తున్నారు అక్రమార్కులు. అలా 1052 క్యారెట్ల రూ.5.76 కోట్ల విలువైన వజ్రాలను తరలించటానికి ఓ వ్యక్తి భలే తెలివితేటలు ఉపయోగించాడు. సూట్ కేసు హ్యాండిల్ లో వజ్రాలు ఉంచి తరలించటానికి యత్నిస్తుండగా చెన్నై ఎయిర్ పోర్టులో అధికారులు తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయాడు.

Read more : Head Master raped girl : మాస్కు పెట్టుకోలేదని పిలిచి..విద్యార్ధినిపై హెడ్మాస్టర్ అత్యాచారం

చెన్నై నుంచి దుబాయ్‌కు వెళ్లే ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు బుధవారం (డిసెంబర్ 29,2021)తనిఖీ చేస్తుండగా ఓ ప్రయాణికుడిని అధికారులు దాన్ని క్షుణంగా తనిఖీలు చేయగా..సూట్ కేసు హ్యాండిల్‌లో ఉంచిన వజ్రాలు గుట్టు బయటపడింది. ఆ వజ్రాలు రూ.5.76 కోట్ల విలువైనవిగా ఉంటాయని అధికారులు అంచనా వేశారు.

వజ్రాలకు అక్రమంగా తరలిస్తునన ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆఫ్రికా నుంచి ముడి వజ్రాలను చెన్నైకి తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో తనిఖీలు చేయగా ముంబైకి చెందిన ఓ ప్రయాణికుడు కాంగో నుంచి చెన్నైకి వచ్చినట్లు తెలిసింది. మూడు పాలిథిన్‌ కవర్లలో రూ.11 లక్షల విలువైన వజ్రాల రాళ్లను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అతడిని అరెస్టు చేసినట్లు చెన్నై విమానాశ్రయ అధికారులు తెలిపారు.

Read more :Drugs Gang : మెక్సికోలో డ్రగ్స్ ముఠాల మధ్య కాల్పులు.. ఎనిమిది మంది మృతి