Drugs Gang : మెక్సికోలో డ్రగ్స్ ముఠాల మధ్య కాల్పులు.. ఎనిమిది మంది మృతి

మెక్సికోలో రెండు డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో 8మంది మృతి చెందారు. సాయుధులైన ఇద్దరు వ్యక్తులు రెండు ఇళ్లను టార్గెట్ గా చేసుకొని కాల్పులకు తెగబడ్డారు.

Drugs Gang : మెక్సికోలో డ్రగ్స్ ముఠాల మధ్య కాల్పులు.. ఎనిమిది మంది మృతి

Drugs Gang

Drugs Gang : మెక్సికోలో రెండు డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో 8మంది మృతి చెందారు. సాయుధులైన ఇద్దరు వ్యక్తులు రెండు ఇళ్లను టార్గెట్ గా చేసుకొని కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఏడాది బాలుడు, 16 ఏళ్ల బాలికతోపాటు మరో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం రాత్రి మధ్య మెక్సికోలోని గ్వానాజువాటో ప్రాంతంలో చోటుచేసుకుంది.

చదవండి : Mexico : ఘోర ప్రమాదం 49 మంది మృతి.. 40 మందికి గాయాలు

దుండగులు ఒకే ఇంట్లో ఉన్న నలుగురు డ్రగ్స్ స్మగ్లర్లను టార్గెట్ చేసుకొని కాల్పులకు దిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో నలుగురు స్మగ్లర్లతోపాటు.. నలుగురు సాధారణ ప్రజలు మృతి చెందారని వివరించారు. ఈ దాడిలో మరో ముగ్గురు గాయపడగా వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

చదవండి : Mexico Covid 3rd Wave : మెక్సికోలో కొవిడ్ మూడో దశ మొదలైంది.. యువతలోనే 29శాతం అధికం!

కాగా మెక్సికోలో అత్యంత హింసాత్మక రాష్ట్రాల్లో గ్వానాజువాటో ఒకటి. ఇక్కడ డ్రగ్స్ ముఠాలైన శాంటా రోసా డి లిమా, జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్స్ మధ్య తరచూ గన్ ఫైట్ జరుగుతూ ఉంటుంది. నవంబర్ నెలలో జరిగిన కాల్పుల్లో 11 మంది మరణించారు. కాగా 2006 నుంచి మెక్సికో ప్రభుత్వం మాదకద్రవ్యాల వ్యతిరేక సైనిక చర్యను ప్రారంభించింది. అప్పటి నుంచి దేశంలో 3 లక్షల మంది హత్యకు గురయ్యారు.