Gold kulfi : చేసేది ‘గోల్డెన్ కుల్ఫీ’ వ్యాపారం.. అతని ఒంటి నిండా బంగారం.. ఇండోర్‌లో ఓ ట్రేడర్ బాగా…. రిచ్

ఇండోర్ లో ఓ వ్యాపారి ఒళ్లంతా బంగారమే. ఇక ఆయన చేసేది 'గోల్డెన్ కుల్ఫీ' వ్యాపారం. 'గోల్డెన్ కుల్ఫీనా'..? అని ఆశ్చర్యపోతున్నారు కదా.. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఇతని వీడియో చూసిన జనం డబ్బు ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నారు? అని మండిపడుతున్నారు.

Gold kulfi

Gold kulfi :  జనాల్ని ఆకట్టుకోవడానికి వ్యాపారస్తులు కొత్తగా ఆలోచనలు చేస్తారు. ఓ వ్యాపారి బంగారం రేకులు చుట్టిన కుల్ఫీని అమ్ముతున్నాడు. ఇండోర్ కి చెందిన ఆ వీధి వ్యాపారి ఒళ్లంతా బంగారం పెట్టుకుని మరీ ఈ వ్యాపారం చేస్తున్నాడు.

Paan Burger : ‘పాన్ బర్గర్ అంట’.. కొత్త కాంబినేషన్ చూసి మండిపడుతున్న ఫుడ్ లవర్స్

రోజులో కొన్ని రకాల వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. చాలామంది తమ షాపుల దగ్గరకి జనాలు వచ్చేందుకు మరీ విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. కుల్ఫీలు అందరికీ ఇష్టమే.. సాదా, పిస్తా,మామిడి ఇంకా కొన్ని వెరైటీలు ఉన్న కుల్ఫీలు అందరూ తినడానికి ఇష్టపడతారు.

 

గోల్డెన్ కుల్ఫీ గురించి విన్నారా? ఇండోర్ లో ఓ వ్యాపారి గోల్డెన్ కుల్ఫీ విక్రయిస్తున్న వీడియోని ఫుడ్ బ్లాగర్ కలాష్ సోనీ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియోలో వ్యాపారి ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించాడు. అతను ఫ్రిజ్ నుండి కుల్ఫీ ముక్కను తీసి దానిని ’24 క్యారెట్ గోల్డ్ లీఫ్’ లో చుట్టాడు. ఈ కుల్ఫీ ధర అక్షరాల 351 రూపాయలు. ఈ వీడియోపై జనం స్పందిస్తున్నారు.

celebrity restaurant : 5 స్టార్ హోటల్‌‌లో ఫుడ్ క్రిటిక్‌లా నటించాడు.. రెస్టారెంట్ వాళ్లిచ్చిన ట్రీట్మెంట్‌కి షాకయ్యాడు

ఎందుకిలా డబ్బు వృధా చేస్తున్నారో అర్ధం కావట్లేదు అని కొందరు.. అది నకిలీ బంగారమని 24 క్యారెట్ కానే కాదని రిప్లై చేస్తున్నారు. వ్యాపారం పెంచుకునేందుకు అతని ఐడియా ఐతే బాగుంది.. కానీ ఇలాంటివి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో అని ఫుడ్ లవర్స్ ఆందోళన చెందుతున్నారు. తాము వైరల్ అవ్వడం కోసం డబ్బులు ఎక్కువై తమ ఆరోగ్యంపై ఇలాంటి ప్రయోగాలు చేయద్దని సీరియస్ అవుతున్నారు.