celebrity restaurant : 5 స్టార్ హోటల్‌లో ఫుడ్ క్రిటిక్‌లా నటించాడు.. రెస్టారెంట్ వాళ్లిచ్చిన ట్రీట్మెంట్‌కి షాకయ్యాడు
కొన్ని ప్రాంక్‌లు ఫెయిలైతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. నిజం తెలిసాక కొందరు సరదాగా తీసుకోవచ్చు.. కొందరు ఉతికి ఆరేయచ్చు. ఓ కుర్రాడు తానో ఫుడ్ క్రిటిక్ అని చెప్పుకుని ఫైవ్ స్టార్ రెస్టారెంట్‌కి వెళ్లాడు. ఆ తరువాత ఏమైంది? చదవండి.

celebrity restaurant
celebrity restaurant : ఇటీవల కాలంలో ప్రాంక్‌లు చేయడం.. అవి పేలితే ఓకే.. ఫెయిలైతే నానా తిప్పలు పడటం చూస్తూనే ఉన్నాం. రీసెంట్‌గా ఓ కుర్రాడు తానో ఫుడ్ క్రిటిక్ (food critic) అని చెప్పుకుని స్టార్ హెటల్ కి వెళ్లాడు. అక్కడ ఫుడ్ లాగించేసాడు. ఫైనల్ గా ఏం జరిగిందంటే?
గిల్డ్ (Guild) అనే కుర్రాడికి ఓ ఫైవ్ స్టార్ సెలబ్రిటీ రెస్టారెంట్‌కి ( five-star restaurant) వెళ్లాలి అనిపించింది. తాను ఒక ఫుడ్ క్రిటిక్ అని చెప్పుకుంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించింది. నటిస్తాడు సరే.. దొరికిపోతే ఈ ఆలోచనలు పక్కన పెట్టి తను అనుకున్నది అమలు చేసేసాడు. హోటల్‌లోని వెళ్లి తనను తాను ఫుడ్ క్రిటిక్ అని పరిచయం చేసుకున్నాడు. సిబ్బంది అతనిని మర్యాద పూర్వకంగా కూర్చోబెట్టారు. గిల్డ్ తన చేతిలో ఉన్న పుస్తకంలో ఏదో రాసేస్తున్నట్లు తెగ నటించేసి వాళ్లు తెచ్చిన ప్రతి ఐటమ్ లాగించేసాడు. చివరగా ఆ హోటల్‌లో ఎంతో ఫేమస్ అయిన వంటకం ‘లాబ్స్టర్ గోల్డెన్ పిజ్జా’ను (lobster golden pizza) ఆరగించాడు. చివరిగా వెయిటర్ ఇచ్చిన బిల్ చూసి షాకయ్యాడు. బాధతో కాదు సుమా.. ఆనందంతో.. అతను తిన్న ఫుడ్ పూర్తి ఉచితంగా అందించింది ఆ స్టార్ హోటల్. అంతే గిల్డ్ ఆనందానికి అవధులు లేవు. ఈ వీడియో చేస్తున్నంత సేపు గిల్డ్‌లో ఏ మాత్రం టెన్షన్ కనిపించలేదు. వీడియో చూసిన వారు మాత్రం ఎక్కడ దొరికిపోయాడో అని కంగారు పడిపోయారు. ఈ వీడియో తానే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అకౌంట్‌లో షేర్ చేశాడు. జనం తెగ కామెంట్లు పెడుతున్నారు.
Viral Video : షాకింగ్.. పోలీస్‌ని 20 కిమీ లాక్కెళ్లిన కారు డ్రైవర్, వీడియో వైరల్
విషయం తెలిస్తే నీ పరిస్థితి ఏమయ్యేది గిల్డ్ అని కొందరు.. ఈ వీడియోలో నువ్వు చేసినదంతా స్క్రిప్టెడ్ అయి ఉండొచ్చును కదా.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా గిల్డ్ ఈ వీడియోతో ఫేమస్ అయిపోయాడు. ఈ వీడియో మరి ఆ రెస్టారెంట్ వారికి చేరితే ఆ తరువాత ఏం జరిగిందన్నది మళ్లీ గిల్డ్ షేర్ చేసాకే మనకి తెలిసే అవకాశం ఉంది.
View this post on Instagram