Uttam Kumar Reddy: కేసీఆర్‌కు బీజేపీతో రహస్య ఒప్పందం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రతిపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ హాజరుకాకపోవడం వెనుక కేసీఆర్ కుట్ర దాగి ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఎన్డీఏను ఓడించే అవకాశం వచ్చినప్పుడు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.

Uttam Kumar Reddy: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు, బీజేపీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని, అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గురువారం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు.

Donkey Milk Farm: ఐటీ జాబ్ వదిలి గాడిద పాల వ్యాపారం

‘‘ప్రతిపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ హాజరుకాకపోవడం వెనుక కేసీఆర్ కుట్ర దాగి ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఎన్డీఏను ఓడించే అవకాశం వచ్చినప్పుడు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. గత రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌కు మద్దతు ఇవ్వలేదు. ఆర్ఎస్ఎస్ అనుకూల అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్‌కు రాష్ట్రపతిగా ఓటు వేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కరుడుగట్టిన బీజేపీ వాది వెంకయ్య నాయుడుకు అనుకూలంగా ఓటు వేశారు. పార్లమెంటులో అన్ని విషయాల్లో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. బీజేపీకి టీఆర్ఎస్ దూరంగా ఉంటే ప్రతిపక్షాల అభ్యర్థికి టీఆర్ఎస్ ఓటు వేయాలి. లేదంటే టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని తెలంగాణ ప్రజలు అనుకుంటారు.

Presidential Elections: రాష్ట్రపతి ఎన్నిక.. మొదటి రోజు 11 నామినేషన్లు

కేసీఆర్ జాతీయ పార్టీ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. ఎనిమిదేళ్లలో బాగా అవినీతికి పాల్పడ్డారు. స్వతంత్ర్య భారత దేశంలో అత్యంత అవినీతిపరుడు కేసీఆరే. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ రెండు లేదా మూడు ఎంపీ స్థానాలకే పరిమితం అవుతుంది. రెండు, మూడు ఎంపీ స్థానాలతో జాతీయ పార్టీ ఏర్పాటు హాస్యాస్పదం’’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు