Mastodon : ఎలన్ మస్క్ దెబ్బకు మాస్టోడాన్‌‌కు మారిపోతున్న ట్విట్టర్ యూజర్లు.. ట్విట్టర్‌కు, మాస్టోడాన్‌‌‌కు తేడా ఏంటి? ఎలా ఉపయోగించాలో తెలుసా?

Mastodon : ప్రపంచ బిలియనీర్ ఎలోన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్‌ని కొనుగోలు చేశాడు. అప్పటినుంచి ట్విట్టర్ ప్లాట్ ఫారంలో అనేక మార్పులు చేస్తున్నాడు. అప్పటినుంచి చాలా మంది ట్విట్టర్ యూజర్లు తమ ప్లాట్‌ఫారమ్‌ను విడిచి మరో కొత్త ప్లాట్ ఫారంకు మారిపోతున్నారని ఓ నివేదిక వెల్లడించింది.

Mastodon : ప్రపంచ బిలియనీర్ ఎలోన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్‌ని కొనుగోలు చేశాడు. అప్పటినుంచి ట్విట్టర్ ప్లాట్ ఫారంలో అనేక మార్పులు చేస్తున్నాడు. అప్పటినుంచి చాలా మంది ట్విట్టర్ యూజర్లు తమ ప్లాట్‌ఫారమ్‌ను విడిచి మరో కొత్త ప్లాట్ ఫారంకు మారిపోతున్నారని ఓ నివేదిక వెల్లడించింది. మస్క్ ట్విట్టర్ పగ్గాలు అందుకున్న కొద్ది రోజుల తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రాథమిక ఫీచర్‌లు లేదా సర్వీసులతో డబ్బు ఆర్జించాలనే మస్క్ ప్రణాళికల కారణంగా ట్విట్టర్ యూజర్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ బ్లూ టిక్ (Twitter Blue Tick), మానిటైజేషన్, లాంగ్ వీడియోలను పోస్ట్ చేయడం, ఇతర ఫీచర్ల వినియోగంపై యూజర్ల నుంచి 8 డాలర్లు వసూలు చేస్తున్నట్టు మస్క్ ప్రకటించాడు. కొన్ని వీడియోలను వీక్షించినందుకు యూజర్ల నుంచి ఛార్జీలు వసూలు చేయాలని కూడా మస్క్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు.

వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం ఛార్జీలు వసూలు చేయడంతో పాటు వేలాది మంది ట్విట్టర్ ఉద్యోగులను తొలగించడం వంటి నిర్ణయాలపై చాలా మంది యూజర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది ట్విట్టర్ యూజర్లు ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు మారాలని నిర్ణయించుకున్నారు. Reddit వంటి అనేక ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నప్పటికీ.. ట్విట్టర్ యూజర్లు చాలామంది మాస్టోడాన్‌ (Mastodon)కు మారిపోతున్నట్టు సమాచారం. గత వారమే 2లక్షల 30వేల మంది కొత్త యూజర్లు మాస్టోడాన్‌లో చేరారని ప్లాట్‌ఫారమ్ బృందం తెలిపింది. వారందరూ ట్విట్టర్ వినియోగదారులా కాదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. మాస్టోడాన్‌ ప్లాట్ ఫారంలో సైన్ అప్ అయ్యాక ప్లాట్‌ఫారమ్‌లో రెండు హ్యాష్‌ట్యాగ్‌లు #Twitterreufugees, #Introduction ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Twitter users are switching to Mastodon What is it, how to use it, and more

మాస్టోడాన్ అంటే ఏంటి? సర్వర్లు ఎలా పనిచేస్తాయంటే?
మాస్టోడాన్ అనేది ఒక ఓపెన్ సోర్స్ మైక్రో-బ్లాగింగ్ సైట్. Twitter నుంచి కొంచెం భిన్నంగా పనిచేస్తుంది. ఈ ప్లాట్ ఫారం డిసెంట్రలైజ్ పద్ధతిలో పనిచేస్తుంది. Twitter మాదిరిగా కాకుండా వినియోగదారుల వద్దనే సర్వర్లు ఉన్నాయి. చాలా సర్వర్‌లు అకా కమ్యూనిటీలను కలిగి ఉన్న విభిన్న కేటగిరీలు ఉన్నాయి. యూజర్లు వారి ఆసక్తి ఆధారంగా వాటిలో ఏ సర్వర్లలోనైనా చేరవచ్చు. ఉదాహరణకు.. ఎవరైనా యూజర్ ‘General’ కేటగిరీలో C.IM సర్వర్‌ని ఎంచుకుంటే.. సాధారణ, ప్రధానంగా ఇంగ్లీష్ మాట్లాడే మాస్టోడాన్ కమ్యూనిటీగా చెప్పవచ్చు.

మీరు సాధారణంగా ఏదైనా అంశంపై గురించి ఇక్కడ మాట్లాడవచ్చు. వివిధ భాషలలో సర్వర్లు ఉన్నాయి. ప్రతి సర్వర్‌కు ఒక వివరణ ఉంటుంది. ఇది నిర్దిష్ట కమ్యూనిటీ నుంచి ఏమి అవసరమో దాన్ని వివరిస్తుంది. యూజర్లు తమ ఆలోచనలను షేర్ చేసుకోవచ్చు. ఎంత మంది వ్యక్తులు సర్వర్‌లో చేరారో కూడా ఈ యాప్ చూపిస్తుంది. మీ ఆలోచనలను షేర్ చేసుకోవడానికి నిర్దిష్ట సర్వర్‌లో తగినంత మంది యూజర్లు ఉన్నారో లేదో అర్థం చేసుకునేందుకు మీకు సాయపడుతుంది. సెట్టింగ్ సెక్షన్ మార్పులు చేయడం ద్వారా యూజర్లు ఇతర సర్వర్‌లకు మారవచ్చు. మీ మొత్తం డేటా కూడా ఆయా సర్వర్లకు ట్రాన్స్ ఫర్ అవుతుంది.

మాస్టోడాన్‌కి ఎలా లాగిన్ చేయాలంటే? :
Mastodon ప్లాట్ ఫారం అనేది ఒక ఫ్రీ సర్వీసుగా చెప్పవచ్చు. Facebook, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల వంటి భారీ నిధులను కలిగి ఉండదని గమనించాలి. మీరు Mastodon యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత.. మీరు కేవలం ‘Get started’ పై Tap చేయాలి. అప్పుడు మీరు సర్వర్‌ని ఎంచుకోవాలి. ప్లాట్‌ఫారమ్ రూల్స్ అంగీకరించాలి. ఆపై మీ యూజర్ ID, పాస్‌వర్డ్‌ని క్రియేట్ చేసుకోవాలి. మీరు మీ ఈ-మెయిల్ ఐడిని రిజిస్టర్ చేసుకోమని అడుగుతుంది. ఆ తర్వాత మీరు మీ అకౌంట్ ధృవీకరించడానికి మీ ఈ-మెయిల్ సర్వీసును వినియోగించుకోవాలి. ఒకసారి వెరిఫై అయ్యాక మీరు ఇప్పుడు మాస్టోడాన్ అకౌంట్ వినియోగించుకోవచ్చు. మాస్టోడాన్‌లో చేరడానికి ప్లాట్‌ఫారమ్‌కు మీకు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. కానీ మీ వయస్సు ఉందో లేదో చెక్ చేయడానికి మరో మార్గం లేదు.

Twitter users are switching to Mastodon What is it, how to use it, and more

Mastodon ఎలా ఉపయోగించాలి? :
మీరు యాప్‌కి రైట్ కార్నర్‌లో దిగువన ఉన్న బిగ్ ఎడిట్ బటన్‌పై Tap చేయాలి. అక్కడే ఏదైనా పోస్ట్ పెట్టుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా.. మీ మెసేజ్ టైప్ చేసి ఆపై Publish ఆప్షన్ నొక్కండి. రీట్వీట్‌లు, లైక్‌లను రీబ్లాగ్డ్ , ఫేవరెట్ అని పిలుస్తారు. మీరు సర్వర్‌తో లాగిన్ చేసిన తర్వాత.. నిర్దిష్ట సర్వర్‌లోని యూజర్లు షేర్ చేస్తున్న కంటెంట్‌ని యాప్ చూపిస్తుంది. యూజర్లు తమ ప్లాట్‌ఫారమ్‌లో ఎవరి కోసం అయినా సెర్చ్ చేయవచ్చు. కానీ, వార్తలు, హ్యాష్‌ట్యాగ్‌లు, కమ్యూనిటీ For You ట్యాబ్‌ల వంటి కేటగిరీలలో చూసే కంటెంట్ పూర్తిగా ఎంచుకోవచ్చు.

మీ సర్వర్‌లో యూజర్లు షేర్ చేస్తున్న వాటిపై ఆధారపడి ఉంటుంది. మీరు హోమ్ పేజీలో ఫాలో అయ్యే యూజర్ల కంటెంట్‌ను చూడవచ్చు. మీరు Twitter మాదిరిగా ప్రొఫైల్ విభాగంలో మీ పోస్ట్‌లను చెక్ చేయవచ్చు. యూజర్లు తమ పోల్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. ఇక ఫోటోలు లేదా వీడియోలను పోస్ట్ చేయవచ్చు. యానిమేటెడ్ ఎమోజీలను పోస్ట్ చేయవచ్చు. ప్రైవసీ ఆప్షన్ కూడా పొందవచ్చు. మీ పోస్ట్‌కు ఎవరు రెస్పాన్స్ ఇవ్వగలరో సెట్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. మంచి విషయం ఏమిటంటే.. ఇక్కడ క్యారెక్టర్ లిమిట్ తక్కువగా ఉండదు. దాదాపు 5,000 వేల వరకు వినియోగించుకోవచ్చు. అదే Twitter ప్రతి ట్వీట్‌కు 280 అక్షరాల పరిమితి మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

Twitter users are switching to Mastodon What is it, how to use it, and more

Mastodon : ఫీచర్‌లు ఏమి లేవు, యాడ్స్, ఏవైనా సమస్యలు ఉన్నాయా?
ఈ ప్లాట్ ఫారంలో Twitter మాదిరిగా అన్ని ఫీచర్లు ఉండవు. కానీ ఫంక్షనాల్టీ ఎక్కువగా ఉంటాయి. మీరు మీ పోస్ట్‌లను డ్రాఫ్ట్‌లుగా సేవ్ చేయడానికి వీలుండదు. ఇందులో DM సెక్షన్ లేదు. బ్లూ టిక్ ఫీచర్ అందరికీ అందుబాటులో ఉన్నట్లు లేదు. యూజర్ ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఎలాంటి యాడ్స్ చూడలేరు. చాలా మంది యూజర్లు ఈ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

కొన్నిసార్లు లోడ్ అయ్యే టైం కొంచెం నెమ్మదిగా ఉన్నాయని, నోటిఫికేషన్‌లు సమయానికి రావడం లేదని చెబుతున్నారు. కొత్త అప్ డేట్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, ఈ ప్లాట్‌ఫారమ్‌లో పరిమిత యూజర్లు, సంస్థలు మాత్రమే ఉన్నాయి. యూజర్లు ఎక్కువ కాలం ఈ సర్వీసులను వినియోగించుకోవడం కష్టమనే చెప్పవచ్చు. రాబోయే వారాల్లో లేదా నెలల్లో మాస్టోడాన్ మరింత మందిని ఆకర్షించగలదా అనేది చూడాలి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Twitter Employees: ట్విటర్ నుంచి 50శాతం మంది ఉద్యోగులు ఔట్..? తొలగింపు ప్రక్రియ ప్రారంభమైందన్న ట్విట్టర్

ట్రెండింగ్ వార్తలు