Blood
prophet row: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని మల్దాస్ వీధిలో ఓ టైలర్ తలనరికి ఇద్దరు వ్యక్తులు హత్య చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. హత్యకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటోన్న నేపథ్యంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దాదాపు 800 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఉదయ్‌పూర్‌లో అన్ని దుకాణాలు మూసేశారు.
Maharashtra: నడ్డాతో ఫడ్నవీస్ భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ
కొన్ని రోజుల క్రితం మహమ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ (బీజేపీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్న నాయకురాలు) అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమెకు మద్దతు తెలుపుతూ ఉదయ్‌పూర్‌లో ఓ టైలర్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఆయనను పోలీసులు పలుసార్లు విచారణకు కూడా పిలిచారు. ఆ టైలర్ హత్యపై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ విచారం వ్యక్తం చేశారు. ఇదో సిగ్గుమాలిన చర్య అని, చాలా బాధాకరమని అన్నారు. ఈ ఘటనకు పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Gudivada Mahanadu : టీడీపీ గుడివాడ మినీ మహానాడు వాయిదా, టార్గెట్ కొడాలి నాని అంటున్న తమ్ముళ్లు
శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేలా ఎవ్వరూ ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. మృతుడి పేరు కన్నయ్య లాల్ అని తెలుస్తోంది. ఉదయ్‌పూర్‌లో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకుంటుండడంతో పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. కొందరు ఆందోళనకారులు వాహనాలను తగులబెట్టారు.