అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ కన్నుమూత

  • Publish Date - May 15, 2020 / 04:32 AM IST

మాజీ అండర్ వరల్డ్ డాన్, సోషల్ యాక్టివిస్ట్ ముతప్ప రాయ్(68) కన్నుమూశాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. గత ఏడాదిగా బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్న ముతప్ప.. ఆరోగ్యం మరింత విషమించడంతో ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్డులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ రాత్రి 2.30 గంటల సమయంలో మరణించాడు. ముతప్పకు ఇద్దరు కుమారులు ఉన్నారు. దక్షిణ కన్నడ పుత్తూరు పట్టణంలో తులు మాట్లాడే బంట్ కుటుంబంలో రాయ్ జన్మించాడు. చాలా చిన్న వయస్సులోనే నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. 

హత్య, కుట్రకు సంబంధించి 8 క్రిమినల్ కేసుల్లో కర్ణాటక పోలీసులు ముతప్పకు అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. 2002లో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి భారతదేశానికి రాయ్ వచ్చాడు. ఇండియాకు వచ్చినవెంటనే కన్నడ పోలీసులతోపాటు సీబీఐ సహా దర్యాప్తు బృందాలు ముతప్పను పలు కోణాల్లో విచారించాయి. 

ఆధారాలు లేకపోవడంతో అతన్ని నిర్దోషిగా ప్రకటించారు. ‘జయ కర్ణాటక’ పేరుతో చారిటబుల్ సంస్థను రాయ్ స్థాపించాడు. 2011లో విడుదలైన తులు చిత్రం ‘Kanchilda Baale’లో రాయ్ నటించారు. ఆ తర్వాత 2012లో వచ్చిన Katari Veera Surasundarangi కన్నడ చిత్రంలో కూడా రాయ్ నటించాడు. 

Read Here>> విజయ్ మాల్యాకు బిగ్ షాక్…28రోజుల్లో భారత జైలుకు

ట్రెండింగ్ వార్తలు