India Omicron
Omicron ceses in India : కొత్త వేరియంట్ గా మారి ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ భారత్ లో కూడా గుబులు పుట్టిస్తోంది. దేశంలో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు 155 నమోదయ్యాయని అనుకుంటుంటే కాదు ఇంకా ఎక్కువేనని తెలిపారు కేంద్రం ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మండవీయ. భారత్ లో 161 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయాయని..ఒమిక్రాన్ పరిస్థితులపై రాజ్యసభలో మాట్లాడుతు ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మండవీయ ప్రకటించారు. దేశంలో 161 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయని..ఇప్పటి వరకు దేశంలో 137 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసామని తెలిపారు. థర్డ్ వేవ్ పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారని కాబట్టి ప్రజలంతా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఏమాత్రం కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించవద్దని సూచించారు.
Read more : CM Kejriwal : ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు..ఉచిత రేషన్ పథకం 6 నెలలపాటు పొడిగింపు
కోవిడ్ థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. మెడీసీన్లు అందుబాటులో ఉన్నాయినీ..దేశంలో కోవిడ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఒమిక్రాన్ కట్టడికి అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టామన్నారు. త్వరలో చిన్నారులకు వ్యాక్సిన్ అందజేస్తామని హామీ ఇచ్చారు మంత్రి.