CM Kejriwal : ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు..ఉచిత రేషన్ పథకం 6 నెలలపాటు పొడిగింపు

టీచర్స్ యూనివర్శిటీని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కొత్త తరం ఉపాధ్యాయులను సిద్ధం చేయడానికి టీచర్స్ యూనివర్శిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.

CM Kejriwal : ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు..ఉచిత రేషన్ పథకం 6 నెలలపాటు పొడిగింపు

CM Kejriwal

CM Kejriwal : ఢిల్లీ ప్రభుత్వ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీలో కరోనా కాలం నుండి ఇప్పటి వరకు ఇస్తున్న ఉచిత రేషన్ పథకం కాలపరిమితిని 6 నెలల పాటు పొడిగించింది. ఉచిత రేషన్ పథకం కాలపరిమితిని మే 31, 2022 వరకు పొడిగిస్తూ ఢిల్లీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించిచారు.

ఢిల్లీ ప్రభుత్వం టీచర్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేయనుంది. కొత్త తరం ఉపాధ్యాయులను సిద్ధం చేయడానికి టీచర్స్ యూనివర్శిటీ ఏర్పాటుకు ఢిల్లీ కేబినెట్ నిర్ణయించింది. టీచర్స్ యూనివర్శిటీలో 2022-23 సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. అంతర్జాతీయ సంస్థల సహకారంతో టీచర్స్ యూనివర్శిటీ నడవనుంది.