Akhilesh Yadav Compares Jinnah To Gandhi And Sardar Patel
akhilesh yadav compares jinnah to gandhi and sardar patel : పాకిస్థాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నాపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పొగడ్తలు కురిపించారు. యూపీలో 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో ప్రముఖ పార్టీల నాయకులు ఇప్పటినుంచే క్యాంపెయిన్ మొదలు పెట్టేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ వరాలు కురిపిస్తోంది. మరోపక్క ప్రతిపక్ష పార్టీలు కూడా రంగంలోకి దిగి వారి యత్నాలు వారు చేస్తున్నారు.
ఈక్రమంలో పాకిస్థాన్ జాతిపిత..భారత విభజనకు కారణమైన మహమ్మద్అలీ జిన్నా గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు అంటూ అఖిలేష్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. ఆదివారం (అక్టోబర్ 31,2021)న హర్దోయ్‌లో ఎస్పీ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో అఖిలేష్ ప్రసంగిస్తు జిన్నాను పొగిడారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మాగాంధీ, జిన్నా ఒకే సంస్థలో చదివి న్యాయవాదులు అయ్యారనీ..వీరందరూ భారత స్వాత్రంత్య పోరాటంలో కీలకంగా వ్యవహరించారని కొనియాడారు.
Read more : మద్యం బాటిల్ కు పాకిస్థాన్ జాతిపిత ‘జిన్నా’ పేరు
వారంతా కులాలకు అతీతంగా ప్రజా శ్రేయస్సు కోస కృషి చేశారని..కానీ బీజేపీ మాత్రం ప్రజల్ని కులాలు,మతాల వారీగా విభజిస్తు వారి మధ్య చిచ్చు పెడుతోందని విమర్శలు కురిపించారు. భారత దేశంలో వివిధ కులాలు..మతాలవారు కలిసి మెలిసి జీవిస్తున్నారని అది భారతదేశానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతిగొప్ప గుర్తింపు పొందిందని అన్నారు.
అప్పట్లో పటేల్‌కు సర్దార్ రైతుల కోసం పోరాడారని..అందుకే ఆయనకు ‘సర్దార్’అనే బిరుదు వచ్చిదని..అఖిలేష్ యాదవ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ..సర్దార్ వల్లభాయ్ పటేల్ బాటే మా బాట అని చెప్పుకుంటున్న బీజేపీ మాత్రం రైతుల గోడు పట్టించుకోవట్లేదని విమర్శించారు. రైతులకు నష్టం కలిగించే చట్టాలు తీసుకొచ్చి నెలల తరబడి ఆందోళన చేస్తున్న రైతల్ని మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా వారి వేదనలకు కారాణమవుతోంది అంటూ అఖిలేశ్ బీజేపీని దుయ్యబట్టారు.
Read more : మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సే దేశభక్తుడు : లోక్‌సభలో వ్యాఖ్యానించిన బీజేపీ ఎంపీ
దీంతో పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాను స్వాతంత్ర్య సమరయోధుడిగా అఖిలేశ్ ప్రశంసించటంతో విమర్శలు వస్తున్నాయి. బీజేపీ ఎంపీ బ్రిజ్‌లాల్ అఖిలేశ్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతు..జిన్నా చరిత్ర ఏమిటో అఖిలేశ్ కు తెలిసే మాట్లాడుతున్నారా? తెలియకపోతే ఒకసారి తెలుసుకోవాలని సూచించారు. హిందువులపై సామూహిక హత్యాకాండను జిన్నా ప్రోత్సహించారని, దేశ విభజనకు కారణమైన వ్యక్తిని ప్రశంసించడం మానుకోవాలని హితవు పలికారు. అక్టోబర్ 31 సర్ధార్ వల్లభాయ్ పటేల్..స్వాతంత్ర భారత తొలి ఉప ప్రధాని, హోం మంత్రి,భారత్ లో 500కు పైగా స్వదేశీ సంస్థానాలను విలీనం చేసి స్వతంత్ర భారతావనని ఏకం చేసిన ధీశాలి పటేల్.
Read more : గాడ్సే నిజమైన దేశభక్తుడు : నాగబాబు సంచలన కామెంట్స్