మ‌హాత్మాగాంధీని హ‌త‌మార్చిన గాడ్సే దేశ‌భ‌క్తుడు : లోక్‌స‌భ‌లో వ్యాఖ్యానించిన బీజేపీ ఎంపీ

మ‌హాత్మాగాంధీని హ‌త‌మార్చిన నాథూరామ్ గాడ్సే దేశ‌భ‌క్తుడే అని బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా ఠాకూర్ తెలిపారు. లోక్‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా ఆమె ఈ వ్యాఖ్య‌లు చేశారు.

  • Published By: veegamteam ,Published On : November 27, 2019 / 03:47 PM IST
మ‌హాత్మాగాంధీని హ‌త‌మార్చిన గాడ్సే దేశ‌భ‌క్తుడు : లోక్‌స‌భ‌లో వ్యాఖ్యానించిన బీజేపీ ఎంపీ

Updated On : November 27, 2019 / 3:47 PM IST

మ‌హాత్మాగాంధీని హ‌త‌మార్చిన నాథూరామ్ గాడ్సే దేశ‌భ‌క్తుడే అని బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా ఠాకూర్ తెలిపారు. లోక్‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా ఆమె ఈ వ్యాఖ్య‌లు చేశారు.

మ‌హాత్మాగాంధీని హ‌త‌మార్చిన నాథూరామ్ గాడ్సే దేశ‌భ‌క్తుడే అని బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా ఠాకూర్ తెలిపారు. లోక్‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా ఆమె ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఎస్పీజీ బిల్లు చ‌ర్చ స‌మ‌యంలో డీఎంకే నేత ఏ రాజా కామెంట్ చేశారు. మ‌హాత్మా గాంధీపై గాడ్సే క‌క్ష పెంచుకుని చంపిన‌ట్లు ఆయ‌న త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు. దాన్ని ఎంపీ ప్రజ్ఞా త‌ప్పుప‌ట్టారు.

దేశ‌ భ‌క్తుల‌ను ఉదాహ‌ర‌ణ‌గా వాడ‌రాదు అని ఆమె అన్నారు. మ‌రో అంశంలో ప్ర‌జ్ఞా ఠాకూర్ మ‌రో కామెంట్ కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీనే ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హించింద‌న్నారు. 1984లో భూపాల్‌లో జ‌రిగిన యూనియ‌న్ కార్బైడ్ సంస్థ దుర్ఘ‌ట‌న‌ గురించి ఆమె మాట్లాడారు.

ఆ సంస్థ చైర్మ‌న్ అండ‌ర్స‌న్‌ను ఆమె ఉగ్ర‌వాదిగా పోల్చారు. ఓ విదేశీయుడు వ‌చ్చి వేలాది మందిని చంపేశాడంటూ ఆమె ఆరోపించారు. అత‌ను దేశం విడిచి వెళ్లేలా చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని, దీన్నే ఉగ్ర‌వాదం అంటార‌ని ఆమె అన్నారు.