Agra : గ్రామంలో రోడ్డు కోసం బురద నీటిలోనే నిరసన చేస్తూ..మహిళ మృతి

తమ గ్రామంలో రోడ్డు వేయాలని కోరుతు..81 రోజులుగా..బురద నీటిలోనే నిరసన చేస్తూ.. ఓ మహిళ మృతి చెందింది.

Protest for the road ..women dead in Agra : అది ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా. ఆగ్రా అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన తాజ్ మహల్. అటువంటి ఆగ్రా జిల్లాలోని పలు గ్రామాలకు సరైన రోడ్లే లేవు. డ్రైనేజీ వ్యవస్థ అంతకంటే లేదు.దీంతో ఆగ్రా జిల్లాలోని మూడు గ్రామాల ప్రజలు తమ గ్రామంలో రోడ్లు వేయాలని ఆందోళన చేపట్టారు. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీయే యూపీలో కూడా అధికారంలో ఉంది. అయినా రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో సరైన రోడ్ల సౌకర్యమే లేదు. దీంతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు.

Read more : RGV : ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పటికీ తెరవలేరు.. సినీ పెద్దలపై ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు
యూపీలో త్వరలో ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఇప్పటికైనా తమ గ్రామంలో రోడ్లు వేయాలని ఆగ్రా జిల్లాలోని ధనోలీ, అజీజ్‌పురా, సిరోలీ అనే మూడు గ్రామాల ప్రజలు రోడ్ల కోసం నిరసన చేపట్టారు. సరైన రోడ్డు, మురుగునీరు అంతా రోడ్లపైనే ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు ఆ మురుగునీటిలోనే కూర్చుని ఆందోళన చేపట్టారు. మా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ అధికారులకు ఎన్నో ఏళ్లుగా రోడ్ల కష్టాల గురించి చెప్పుకుంటున్నా ఏమాత్రం చలనం లేదు. వారి గోడుపట్టించుకునే వారే లేరు. దీంతో ఆ మూడు గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానైనా తమ గోడును ప్రభుత్వం వినిపించుకుంటుందేమో అన్న ఆశతో.. దీక్ష చేపట్టారు. రోడ్డుపై ఉన్న గుంతల్లో, బురద నీటిలోనే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. 81 రోజులుగా 3 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.

Read more : Covid-19 For jawans : 38 మంది కోబ్రా జవాన్లకు కరోనా పాజిటివ్

ఈ క్రమంలో సోమవారం (జనవరి3,2022) దీక్షా స్థలంలో రాణీదేవి, కీర్తిదేవి అనే ఇద్దరు మహిళలు కుప్పకూలిపోయారు. వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించగా, రాణీదేవి అప్పటికే చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. కీర్తిదేవి మాత్రం ప్రస్తుతం చికిత్స పొందుతోంది. అలా రోడ్డు కోసం దీక్ష చేస్తు ఓ మహిళ మృతి చెందింది. మరి ఇప్పటికైనా ఆ గ్రామాల ప్రజల కష్టాల్ని ప్రభుత్వం పట్టించుకుంటుందో లేదో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు