Tiger Captured
Tiger Captured: పులులు అటవీ ప్రాంతాల్ని వదిలి జనావాసాల్లోకి రావడం, అక్కడ ప్రజలు, జంతువులపై దాడి చేయడం వంటి ఘటనలు ఈమధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఉత్తర ప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఒక పులి ప్రజలపై దాడి చేసి 40 రోజుల వ్యవధిలో ఐదుగురిని చంపింది. దీంతో ఈ పులి కోసం అధికారులు 40 రోజులుగా వెతుకుతుంటే, మూడు రోజుల క్రితం చిక్కింది. ధడ్వా బఫర్ జోన్‌లోని మంజ్రా పురాబ్ అటవీ ప్రాంతంలో జూన్ 29న పులి అధికారులకు చిక్కింది. ఈ పులిని అటవీ శాఖ అధికారులు శుక్రవారం లక్నోలోని నవాబ్ వాజిద్ అలీ షా జూకు తరలించారు.
Woman Gang-Raped: మహిళ కిడ్నాప్.. నలుగురు అత్యాచారం
శనివారం ఉదయం కల్లా పులి జూకు చేరుకుందని, ప్రస్తుతం పులి సురక్షితంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జంతు నిపుణుల పర్యవేక్షణలో ఉందని అధికారులు చెప్పారు. ఈ పులిని ఆడపులిగా గుర్తించారు. శారీరక వైకల్యం వల్ల గతంలోలాగా సహజంగా వేటాడే శక్తిని కోల్పోవడం వల్ల పులి జనావాసాలపై పడిందని అధికారులు అంటున్నారు. అందువల్లే మనుషుల్ని వేటాడిందన్నారు.