Woman Gang-Raped: మహిళ కిడ్నాప్.. నలుగురు అత్యాచారం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సహరణ్‌పూర్ జిల్లా, దియోబంధ్ పరిధిలో గత జనవరిలో 24 ఏళ్ల మహిళ ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఒక యువకుడు ఇంట్లోకి ప్రవేశించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటనను వీడియో తీసి మహిళను బెదిరించాడు.

Woman Gang-Raped: మహిళ కిడ్నాప్.. నలుగురు అత్యాచారం

Woman Gang Raped

Updated On : July 2, 2022 / 1:45 PM IST

Woman Gang-Raped: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. మహిళను కిడ్నాప్ చేసి, రోజుల తరబడి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి దియోబంద్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సహరణ్‌పూర్ జిల్లా, దియోబంధ్ పరిధిలో గత జనవరిలో 24 ఏళ్ల మహిళ ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఒక యువకుడు ఇంట్లోకి ప్రవేశించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటనను వీడియో తీసి మహిళను బెదిరించాడు. జరిగిన విషయాన్ని ఎవరికైనా చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా.. మహిళ తల్లిందండ్రులను చంపుతానని, వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తానని హెచ్చరించాడు. అంతటితో ఆగకుండా తరచూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భారీ భద్రత

తర్వాత దియోబంద్ పరిధిలో ఒక రహస్య ప్రాంతానికి ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అక్కడ మహిళను బంధించి అతడితోపాటు, మరో ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో మహిళ గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న నిందితులు ఆమెను మరింత హింసించారు. చంపేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమెకు గర్భస్రావం అయింది. అయితే, గత జూన్ 25న అక్కడ్నుంచి ఎలాగోలా తప్పించుకుని వచ్చిన మహిళ, 26న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు. మహిళ చెప్పిన వివరాల ప్రకారం నిందితులంతా 25-30 ఏళ్లలోపు వయసువారే.