AP Rains : ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు.. ఈదురుగాలులు.. హెచ్చరికలు జారీ..
AP Rains : అల్పపీడన ప్రభావం కారణంగా ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
AP Rains
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు
- పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు
- పలు ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు
AP Rains : ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, తాజాగా.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కీలక విషయాలను వెల్లడించింది. ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Also Read : AP Govt : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మద్యం షాపులు, బార్ల వద్ద ఆ బోర్డులు పెట్టొద్దు..
రాష్ట్రంలో ఇవాళ (గురువారం) ఒకవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ద్రోణి ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడుతాయని, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
రాష్ట్రంలోని మొత్తం 46 మండలాల్లో తీవ్ర ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయని, 79 మండలాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. వర్షాలు పడే సమయంలో, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల వద్ద ఉండొద్దని సూచించారు.
ఇవాళ ఏపీలో వర్షాలతోపాటు పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఏలూరు, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరికొన్ని మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
