Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భారీ భద్రత
పాతబస్తీ, చార్మినార్ పరిధిలోని భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోనున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Bhagyalakshmi Temple
Bhagyalakshmi Temple: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా పాతబస్తీ, చార్మినార్ పరిధిలోని భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోనున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. షెడ్యూల్ ప్రకారం శనివారమే భాగ్యలక్ష్మీ ఆలయాన్ని ఆదిత్య నాథ్ సందర్శించాలి. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం ఆదివారానికి వాయిదా పడింది.
KanhaiyaLal: కన్హయ్య హత్య నిందితుడు బీజేపీ కార్యకర్త: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
యోగి ఆదిత్యా నాథ్ ఆదివారం అమ్మవారిని దర్శించుకుంటారు. దీంతో శాంతి భద్రతలకు భంగం కలగకుండా పోలీసులు గట్టి నిఘా మధ్య భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు కూడా భద్రతలో పాల్గొంటున్నాయి. హైదరాబాద్ సిటీ మొత్తం సిటీ ఆర్మీ రిజర్వ్‌డ్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ తెలంగాణ పోలీస్ బెటాలియన్ ఆధ్వర్యంలో భద్రత కొనసాగుతోంది. సౌత్ డీసీపీ చైతన్య భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు చార్మినార్ వద్ద బైక్ ర్యాలీ చేసేందుకు టీఆర్ఎస్ నేతలు యత్నించడం వివాదాస్పదంగా మారింది. దీంతో పోలీసులు బైక్ ర్యాలీని అడ్డుకున్నారు.