Ilhan Omar
US Congresswoman: అమెరికా చట్టసభ సభ్యురాలు, డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు ఇల్హాన్ ఒమర్ భారత్‌పై తనకున్న వ్యతిరేకతను మరోసారి ప్రదర్శించారు. భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆమె పదే పదే వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాగే, ఆమె రెండు నెలల క్రితమే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటించి కలకలం రేపారు. పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో ఇటీవలే సమావేశమయ్యారు. ఇప్పుడు ఆమె భారత్‌కు వ్యతిరేకంగా అమెరికా కాంగ్రెస్ దిగువ సభలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం.
presidential election 2022: శివాలయంలో చీపురుతో ఊడ్చిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
భారత్‌లో మత స్వేచ్ఛ ఉల్లంఘనలు జరుగుతున్నాయని అమెరికా విదేశాంగ శాఖ గుర్తించాలని కాంగ్రెస్ సభ్యురాలు జువాన్ వర్గాస్‌తో కలిసి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తోన్న ఆందోళనకర దేశంగా మూడు సంవత్సరాల పాటు భారత్‌ను గుర్తించాలని అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ తీర్మానాన్ని విదేశీ వ్యవహారాల కమిటీ కార్యాలయానికి పంపారు. అయితే, బహిరంగంగా పాకిస్థాన్ అధికారుల తరఫున మాట్లాడే ఇల్హాన్ ఒమర్ ప్రవేశపెట్టిన ఇటువంటి తీర్మానాన్ని ఆమోదించే అవకాశాలు అంతగాలేవు. రెండు నెలల క్రితం ఆమె పీవోకేలో పర్యటించడాన్ని భారత్ ఖండించింది. దీంతో ఆమె పర్యటనకు, అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని ఆ దేశ ప్రభుత్వం అప్పట్లోనే ప్రకటించింది.