presidential election 2022: శివాలయంలో చీపురుతో ఊడ్చిన ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము

ఝార్ఖండ్ మాజీ గ‌వ‌ర్న‌ర్ ద్రౌప‌ది ముర్ము(64)ను ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా బీజేపీ ప్రకటించడంతో ఆమె ఇవాళ గుడిలో ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్నారు.

presidential election 2022: శివాలయంలో చీపురుతో ఊడ్చిన ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము

Murmu

presidential election 2022: ఝార్ఖండ్ మాజీ గ‌వ‌ర్న‌ర్ ద్రౌప‌ది ముర్ము(64)ను ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా బీజేపీ ప్రకటించడంతో ఆమె ఇవాళ గుడిలో ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్నారు. త‌న సొంత ప్రాంతం రాయిరంగ‌పూర్‌లో ఉద‌యాన్నే శివాల‌యానికి వెళ్లిన ముర్ము మొద‌ట అక్క‌డ ఉన్న చీపురుతో ఊడ్చారు. ఆల‌యంలోని చెత్తను ఊడ్చిన అనంత‌రం పూజ‌ల్లో పాల్గొన్నారు. ఆమె త్వ‌ర‌లోనే దేశంలోని ప‌లు పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీల‌క నేత‌ల‌ను క‌ల‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

presidential election 2022: ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు ‘జ‌డ్’ ప్ల‌స్ భ‌ద్ర‌త‌

రాష్ట్రప‌తి ఎన్నిక‌లో మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరే అవ‌కాశం ఉంది. ఆమెకు ఇప్ప‌టికే కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్‌) క‌మాండోల‌తో జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త క‌ల్పించిన విష‌యం తెలిసిందే. 14-16 మంది పారామిలిట‌రీ సిబ్బంది ముర్ముకు భ‌ద్ర‌త క‌ల్పిస్తారు. వ‌చ్చే నెల 18న రాష్ట్రప‌తి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో విప‌క్షాల అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా కూడా మ‌ద్ద‌తు కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లు పెడుతున్నారు. నేడు రాష్ట్రప‌తి ఎన్నిక ప్ర‌చార క‌మిటీతో ఆయ‌న స‌మావేశం కానున్నారు.