presidential election 2022: ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు ‘జ‌డ్’ ప్ల‌స్ భ‌ద్ర‌త‌

ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము(64)కు కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్‌) క‌మాండోల‌తో జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త క‌ల్పించిన‌ట్లు అధికారులు తెలిపారు.

presidential election 2022: ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు ‘జ‌డ్’ ప్ల‌స్ భ‌ద్ర‌త‌

Droupadi Murmu

presidential election 2022: ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము(64)కు కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్‌) క‌మాండోల‌తో జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త క‌ల్పించిన‌ట్లు అధికారులు తెలిపారు. కేంద్ర హోం శాఖ ఈ మేర‌కు సీఆర్‌పీఎఫ్‌ను ఆదేశించింద‌ని వివ‌రించారు. 14-16 మంది పారామిలిట‌రీ సిబ్బంది ముర్ముకు భ‌ద్ర‌త క‌ల్పిస్తార‌ని తెలిపారు.

Presidential Elections: 27న నామినేష‌న్ వేయ‌నున్న య‌శ్వంత్ సిన్హా.. ఎన్డీఏ అభ్య‌ర్థి 25న‌?

ముర్ము ఒడిశాతో పాటు దేశంలో ఎక్క‌డ‌కు వెళ్లినా ఆమె వెంటే భ‌ద్ర‌తా సిబ్బంది ఉంటార‌ని అధికారులు చెప్పారు. అలాగే, ఒడిశాలోని రాయిరంగ‌పూర్‌లోని ఆమె నివాసం వ‌ద్ద కూడా భ‌ద్ర‌తా సిబ్బంది ఉంటార‌ని అధికారులు తెలిపారు. త్వ‌ర‌లోనే ముర్ము దేశంలోని ప‌లువురు నేత‌ల‌ను క‌ల‌వ‌డానికి ప‌లు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించే అవ‌కాశం ఉంది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ జ‌రిగే వ‌ర‌కు ఆమెకు 14-16 మంది పారామిలిట‌రీ సిబ్బంది భ‌ద్ర‌త క‌ల్పిస్తారు. వ‌చ్చే నెల 18న రాష్ట్రప‌తి ఎన్న‌క జ‌ర‌గ‌నుంది. ఒడిశాకు చెందిన ద్రౌప‌తి ముర్ము ఝార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్‌గా 2015, మే 18 నుంచి 2021, జూలై 12 వ‌ర‌కు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.