Vakeel Saab Niveda Who Saw The Movie In The Theater With Corona1
Vakeel Saab: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఉండే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాపై కూడా అభిమానులు ఈ స్థాయి అంచనాలే పెట్టుకోగా.. సినిమా ఆ అంచనాలను అందుకుంది. పవన్ మూడేళ్ళ తర్వాత చేసిన సినిమా కావడం.. బొమ్మ బాగుందంటే టాక్ తో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ మేనియానే. ఇప్పటికే ఓపెనింగ్ రికార్డులు బద్ధలయ్యాయనే లెక్కలు బయటకు వస్తుండగా కరోనా కాలంలో కూడా వసూళ్లను రాబట్టడం ఒక్క పవన్ కు మాత్రమే చెల్లిందని అభిమానులు కాలర్ ఎగరేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా పలుచోట్ల అభిమానులు థియేటర్లలో ఓవర్ యాక్షన్.. సాంకేతిక కారణాలతో షోస్ ఆలస్యమవడంతో థియేటర్లను నాశనం చేయడం వంటి చర్యలు ఇప్పటికే వివాదాస్పదమవగా.. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన హీరోయిన్ నివేదా థామస్ కరోనా సోకి వారం గడవకముందే ప్రేక్షకులతో కలిసి థియేటర్ లో సినిమా చూడడం ఇప్పుడు మరో వివాదంగా మారుతుంది. తాజాగా నివేదా పీపీఈ కిట్, గ్లౌజులు, మాస్క్ ధరించి థియేటర్ లో సినిమా చూస్తూ.. జనాలంతా ఆసక్తిగా సినిమా చూస్తున్న స్టిల్ ను పోస్ట్ చేసింది. ఈ మూమెంట్ కోసమే జీవిస్తున్నానంటూ క్యాప్షన్ పెట్టింది.
అయితే.. నివేదాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ సరిగ్గా వారం రోజులే. ఏప్రిల్ 3న తనకు కరోనా సోకినట్టు ఆమెనే స్వయంగా పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్నానని, అందరూ విధిగా పరీక్షలు చేసుకోవాలని కోరింది. తర్వాత వకీల్ సాబ్ రిలీజ్ కు ముందు రోజు కూడా మరో పోస్ట్ పెట్టింది. అందరూ మాస్కులు ధరించి థియేటర్ కు రావాలని కోరింది. అయితే, ఇప్పుడు ఏకంగా థియేటర్ లో ప్రత్యక్షమైంది. మరి ఈ వారం రోజులలోనే ఆమెకి నెగటివ్ ఫలితాలు వచ్చాయా అన్నది ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ నెగటివ్ వచ్చినా కొన్ని రోజులు ఐసోలేషన్ లో ఉండడం ఉత్తమం. ఒకవేళ బయటకి వచ్చినా ఇలా పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్లడం మంచిది కాదు. మరి నివేదా ఏ ఉద్దేశ్యంతో థియేటర్లోకి వెళ్లారో ఆమెకే తెలియాలి.
read: Vakeel Saab: వెర్రి అభిమానం.. థియేటర్లో రక్తంతో పవన్ పేరు!