Vallabhaneni Lokesh
lokesh: పదో తరగతి విద్యార్థులతో టీడీపీ నేత నారా లోకేశ్ జూమ్‌లో సమావేశం నిర్వహిస్తుండగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లోకేశ్ నిర్వహిస్తోన్న ఆ సమావేశంలో ఉన్నట్టుండి ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కనపడ్డారు. విద్యార్థుల పేరుతో వైసీపీ నేతలు జూమ్ సమావేశంలో ఎంట్రీ ఇవ్వడంతో లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Prophet row: నురూప్ శర్మతో పాటు మరో ఏడుగురిపై ఢిల్లీలో కేసులు
ఇలా జూమ్ మీటింగ్‌లోకి చొరబడడం ఎందుకని, తనతో చర్చించాలంటే నేరుగా రావాలంటూ లోకేశ్ సవాల్ విసిరారు. వైసీపీ నేతల బెదిరింపులకు భయపడేదేలేదని లోకేశ్ అన్నారు. జూమ్ సమావేశంలోకి కొడాలి నాని, వల్లభనేని వంశీ రావడంతో విద్యార్థులు కూడా ఆశ్చర్చపోయారు. చివరకు నారా లోకేశ్ హెచ్చరించడంతో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆ సమావేశం నుంచి వెళ్లిపోయారు.