Varalaxmi Sarath Kumar comments on Nayanatara Surrogacy Issue
Varalaxmi Sarath Kumar : ఇటీవల నయనతార, విగ్నేష్ శివన్ కవల పిల్లలు పుట్టారు అనడంతో సరోగసి అని తెలిసి పెద్ద వివాదమే అయింది. చాలా మంది నయన్, విగ్నేష్ సరోగసి రూల్స్ పాటించలేదని ఆరోపణలు చేశారు. ఈ వివాదం ప్రభుత్వం దాకా వెళ్లడంతో తమిళనాడు ఆరోగ్య శాఖ దీనిపై ఓ కమిటీ వేసింది. ఇటీవల ఆ కమిటీ నయన్, విగ్నేష్ అన్ని రూల్స్ పాటించి సరోగసి ద్వారా కవల పిల్లలు కన్నారని తెలపడంతో ఈ సమస్య ముగిసింది.
ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉంది వరలక్ష్మి శరత్ కుమార్. త్వరలో సమంతతో కలిసి నటించిన యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా సరోగసి మాఫియాని ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు. ఇందులో సమంత సరోగసి బిడ్డని కనే తల్లిగా, వరలక్ష్మి డాక్టర్ గా కనిపించనున్నారు. నవంబర్ 11న ఈ సినిమా రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సరోగసి గురించి మాట్లాడుతూ నయనతార వివాదం గురించి కామెంట్స్ చేసింది.
వరలక్ష్మీ శరత్‌కుమార్ మాట్లాడుతూ.. ”యశోద సినిమాలో నేను అద్దె తల్లులని చూసే డాక్టర్ గా నటించాను. కథ విన్నాక బయట ఇలా జరుగుతుందని ఆశ్చర్యపోయాను. అద్దె తల్లి విధానం గురించి ఇటీవల పెద్ద చర్చే జరిగింది. అది బయట మాములుగా జరుగుతూనే ఉంది. అదేమీ వివాదం చేయాల్సిన అంశం కాదు. కానీ అక్కడ ఉన్న నయనతార, విఘ్నేష్ శివన్ లు సెలబ్రిటీస్ కావడంతో ఆ సరోగసి పెద్ద వివాదంగా మారింది. లేకపోతే ఎవరికీ తెలిసే ఆస్కారమే లేదు” అని తెలిపింది.