Varun Tej Ghani Trailer To Release Soon
Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గని’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కిరణ్ కొర్రపాటి పూర్తి స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ మూవీలో వరుణ్ తేజ్ ఓ బాక్సర్ పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమాను గతంలోనే రిలీజ్ చేయాల్సి ఉన్నా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
Ghani : ‘గని’ కోసం రెండు రిలీజ్ డేట్స్!
కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు గీతా ఆర్ట్స్ సంస్థ పేర్కొంది. ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దామని, వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. బాక్సర్ పాత్రలో వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ సరికొత్తగా ఉండబోతుందని, ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. త్వరలో రాబోయే ట్రైలర్ కట్ కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. ఈ చిత్రంలోని పాత్ర కోసం వరుణ్ తేజ్ తీవ్రంగా కష్టపడ్డాడని మేకింగ్ వీడియోలో మనకు చూపించారు.
Ghani: వరుణ్‌తో మిల్కీ బ్యూటీ.. మాస్ మసాలా ఐటెం నెంబర్!
అల్లు బాబీ కంపెనీ మరియు రినైస్సన్స్ పిక్చర్స్ పతాకంపై సిద్ధు ముద్ద, అల్లు బాబీలు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి వంటి మేటి యాక్టర్స్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో కనిపించనుండగా థమన్ సంగీతం అందించాడు.