Vasundhara Raje: ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చే అంశంపై చర్చించాం: వసుంధరా రాజే

అనేక అంశాలపై రెండు గంటలపాటు ప్రాథమిక చర్చలు జరిగినట్లు ఆమె వెల్లడించారు. ‘‘ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవాలి అనే అంశంపై సమావేశంలో చర్చించాం. సంపర్క్ అభియాన్ ద్వారా ప్రజల మన్ కీ బాత్ తెలుసుకునే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం.

Vasundhara Raje: గరీబ్ కళ్యాణ్ అభియాన్ ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చే అంశంపై సమావేశంలో చర్చించినట్లు బీజేపీ నేత, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే తెలిపారు. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరైన ఆ పార్టీ సీనియర్ నేత వసుంధరా రాజే మీడియాతో మాట్లాడారు.

Tiger Captured: ఐదుగురిని చంపిన పులి.. పట్టుకున్న అధికారులు, జూకు తరలింపు

అనేక అంశాలపై రెండు గంటలపాటు ప్రాథమిక చర్చలు జరిగినట్లు ఆమె వెల్లడించారు. ‘‘ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవాలి అనే అంశంపై సమావేశంలో చర్చించాం. సంపర్క్ అభియాన్ ద్వారా ప్రజల మన్ కీ బాత్ తెలుసుకునే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం. గరీబ్ కళ్యాణ్ అభియాన్ ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే అంశం గురించి చర్చించాం. కొన్ని రాజకీయ తీర్మానాలు చేశాం. ఈ సమావేశం జరుగుతున్న తెలంగాణపై కూడా ఒక ప్రకటన చేయాలనే నిర్ణయానికి వచ్చాం. పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఎన్నికల బూత్‌లో కనీసం 200 మంది క్రియాశీల కార్యకర్తలు ఉండాలి. నేతల మధ్య మరింత సమన్వయం కోసం వాట్సాప్ గ్రూప్స్ ఏర్పాటు చేయబోతున్నాం.

Woman Gang-Raped: మహిళ కిడ్నాప్.. నలుగురు అత్యాచారం

పార్టీకి బలమైన పునాది నిర్మించాలని అవగాహనకు వచ్చాం. బూత్ స్థాయి బలోపేతంపై రాష్ట్ర అధ్యక్షులు, ఇతర నేతలు 15 రోజులకు ఒకసారి రివ్యూ చేస్తారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం చేపడతాం. దీని ద్వారా 20 కోట్ల మంది ప్రజలను భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నాం. ఇదొక ఉద్యమం కానుంది’’ అని వసుంధరా రాజే వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు