Vegetable Prices: వర్షాల ప్రభావం.. కూరగాయల ధరలు పెరుగుతాయా?

తోటలు నీట ముగనడం, తోటలకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో కూరగాయలు సేకరించడం కష్టమవుతోంది. అలాగే వానలు, వరదల కారణంగా రవాణా కూడా సక్రమంగా జరగడం లేదు. ఈ కారణంగా కూరగాయలు సేకరించి, మార్కెట్లకు తరలించే పరిస్థితి లేదు.

Vegetable Prices: ప్రస్తుతం రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాల ప్రభావం కూరగాయల ధరలపై ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో పంట పొలాలు, తోటలు నీట మునిగాయి. దీంతో కోతకొచ్చిన కూరగాయలు పాడయ్యే అవకాశం ఉంది. మరోవైపు వర్షాల ప్రభావంతో రైతులు తోటలకు కూడా వెళ్లలేని పరిస్థితి.

Anam Mirza: ‘అప్నే లోగాన్’.. హైదరాబాదీ నయా టాక్ షో

తోటలు నీట ముగనడం, తోటలకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో కూరగాయలు సేకరించడం కష్టమవుతోంది. అలాగే వానలు, వరదల కారణంగా రవాణా కూడా సక్రమంగా జరగడం లేదు. ఈ కారణంగా కూరగాయలు సేకరించి, మార్కెట్లకు తరలించే పరిస్థితి లేదు. దీంతో ప్రధాన మార్కెట్లకు కూరగాయల దిగుమతి భారీ స్థాయిలో తగ్గిపోయింది. దీంతో క్రమంగా కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. నాలుగైదు రోజులుగా భారీ వర్షాల కారణంగా మార్కెట్‌కు వచ్చే కూరగాయల శాతం తగ్గిపోయింది. అయినప్పటికీ మార్కెట్లో అప్పటికే ఉన్న నిల్వల కారణంగా ఇప్పటివరకు సర్దుబాటు అయింది. అయితే, తాజాగా దిగుమతి తగ్గిన దృష్ట్యా కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లకు సంబంధించి శుక్రవారం నుంచి దిగుమతులు తగ్గాయి. గతంతో పోలిస్తే అనేక మార్కెట్లకు 30-50 శాతం మాత్రమే కూరగాయలు దిగుమతి అవుతున్నాయి.

Tata Technologies: 18 ఏళ్ల తర్వాత టాటా టెక్నాలజీస్ ఐపీఓ

బోయిన్‌పల్లి మార్కెట్‌కు సోమవారం కేవలం 12 వేల క్వింటాళ్లు, గుడిమల్కాపూర్‌ మార్కెట్‌కు 4 వేల క్వింటాళ్ల కూరగాయలు మాత్రమే దిగుమతి అయ్యాయి. అదే సాధారణ రోజుల్లో బోయిన్‌పల్లి మార్కెట్‌కు సగటున 32 వేల క్వింటాళ్లు, గుడిమల్కాపూర్‌ మార్కెట్‌కు 10 వేల క్వింటాళ్లు దిగుమతులు అవుతాయి. డిమాండ్‌కు సరిపడా కూరగాయలు అందుబాటులో లేకపోవడంతో ధరలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న వానలు, వరదల ప్రభావం తగ్గే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు