Khudiram Bose Biopic: ‘ఖుదీరామ్ బోస్’ బయోపిక్ టైటిల్‌ను లాంచ్ చేసిన వెంకయ్య నాయుడు
జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ పతాకంపై రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ నటీనటులుగా ప్రతిభావంతుడైన విద్యా సాగర్ రాజు దర్శకత్వంలో కొత్త నిర్మాత విజయ్ జాగర్లమూడి నిర్మిస్తున్న స్వాతంత్ర్య సమరయోధుడి బయోపిక్ చిత్రం ‘ఖుదీరామ్ బోస్’.
- Anil Aaleti
- Published On : August 11, 2022 / 08:48 PM IST
Venkaiah Naidu Launches Khudiram Bose Biopic Title
Khudiram Bose: జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ పతాకంపై రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ నటీనటులుగా ప్రతిభావంతుడైన విద్యా సాగర్ రాజు దర్శకత్వంలో కొత్త నిర్మాత విజయ్ జాగర్లమూడి నిర్మిస్తున్న స్వాతంత్ర్య సమరయోధుడి బయోపిక్ చిత్రం ‘ఖుదీరామ్ బోస్’. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో భారీ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్బంగా ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్‌ను లాంఛ్ చేసింది చిత్ర యూనిట్.
Khudiram Bose : చేతిలో భగవద్గీత.. చిరునవ్వుతో ఉరికంభం ఎక్కిన 18 ఏళ్ల ధీరుడు
ఈ క్రమంలోనే ‘ఖుదీరామ్ బోస్’ చిత్ర టైటిల్‌ను భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చేతుల మీదుగా విడుదల చేసారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ.. ‘భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ 1889లో జన్మించాడు. అయితే ప్రసిద్ధ ముజఫర్‌పూర్ కుట్ర కేసులో బ్రిటీష్ రాజ్ చేత దోషిగా నిర్ధారించబడి, 1908లో మరణశిక్ష విధించబడ్డాడు. ఈ కేసు విషయంలో జరిగిన కుట్ర గురించి చరిత్రను అనుసరించే విద్యార్థులకు బాగా తెలుసు. ఈ వాస్తవాలను నేటితరం జనానికి తెలియజేసేందుకు ఈ సినిమాను రూపొందించాం.’ అని అన్నారు.
ఇక ఇందులో రాకేష్ జాగర్లమూడి తొలిసారిగా నటుడిగా పరిచయమవుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో అత్యుత్తమ నటను కనబరిచినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. సంగీత దర్శకుడు మణిశర్మ, అవార్డు గెలుచుకున్న ప్రొడక్షన్ డిజైనర్ పద్మశ్రీ తోట తరణి, స్టంట్ డైరెక్టర్ కనల్ కన్నన్ మరియు సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మరియు డైలాగ్ రైటర్ బాలాదిత్య.. ఇలా ఈ చిత్రానికి పని చేసిన వారందరూ ఈ సినిమాకు చాలా డెడికేటెడ్‌గా వర్క్ చేయడంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడం జరిగిందని.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది.
