Vijayasai Reddy
vijaya sai reddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు బంధువు అవుతారని, వరుసకు తనకు అన్న అవుతారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనవడు తారకరత్న నా భార్య సోదరి కుమార్తెను పెళ్ళాడాడు’ అని విజయసాయిరెడ్డి చెప్పారు. ఆ వరుసను బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు తనకు అన్న అవుతారని వివరించారు. బంధువు అయినంత మాత్రాన తన ఆస్తులు చంద్రబాబువి, ఆయన ఆస్తులు తనవి అయిపోతాయా అని ఆయన ప్రశ్నించారు.
Maharashtra: ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్ల మార్పు.. ‘మహా’ కేబినెట్ కీలక నిర్ణయాలు
హెరిటేజ్, అరబిందో ఒకటైపోతాయా అని నిలదీశారు. అడాన్ కంపెనీపై టీడీపీ దుష్ర్పచారం చేస్తోందని, తమ కుటుంబానికి ఆ సంస్థతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేస్తోందని ఆయన చెప్పారు. తన బంధువుల సంస్థలు అన్నింటినీ తనవేనంటూ ప్రచారం చేస్తోందని చెప్పారు. టీడీపీ చేస్తోన్న ఆరోపణల ప్రకారం.. చంద్రబాబు కూడా తన బంధువే కాబట్టి ఆయన హెరిటేజ్ కూడా తనదే అవుతుందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే, చంద్రబాబు నాయుడి భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి అనేక సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పారు.