vijaya sai reddy: షర్మిలమ్మ పార్టీ కోసం విజయమ్మ వెళ్తున్నారు: విజయసాయిరెడ్డి
విజయమ్మ హుందాగా గౌరవ అధ్యక్షురాలి బాధ్యతలనుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారని ఆయన అన్నారు, కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మెదడు పనిచేయక నోటికొచ్చినట్టు వైఎస్సార్ కుటుంబం సభ్యుల గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
- T Venkateshwarlu
- Published On : July 9, 2022 / 10:20 AM IST
Vijay Sai Reddy
vijaya sai reddy: వైసీపీ నిర్వహిస్తోన్న ప్లీనరీకి తొలిరోజు లక్షా 60 వేల మంది హాజరయ్యారని ఆ పార్టీ నేత విజయ సాయిరెడ్డి తెలిపారు. నిన్న ప్లీనరీలో ప్రసంగించిన విజయమ్మ హుందాగా గౌరవ అధ్యక్షురాలి బాధ్యతలనుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారని ఆయన అన్నారు, కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మెదడు పనిచేయక నోటికొచ్చినట్టు వైఎస్సార్ కుటుంబం సభ్యుల గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తే తాము కూడా ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Amalapuram: తోటి ఉద్యోగుల ముందే కుప్పకూలి.. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
షర్మిలమ్మ పార్టీ కోసం విజయమ్మ వెళ్తున్నారని ఆయన అన్నారు. కాగా, వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నానని నిన్న విజయమ్మ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో తన కుమార్తె వైఎస్ షర్మిల పెట్టిన పార్టీకి మద్దతుగా ఉంటానని ఆమె చెప్పారు. రెండు పార్టీల్లో ఉన్నానన్న విమర్శలు రాకుండా ఉండేందుకే తాను వైసీపీ నుంచి వైదొలుగుతున్నానని ఆమె తెలిపారు.
