Sajjala Ramakrishna Reddy
YS Vijayamma: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు, రేపు మూడో ప్లీనరీ నిర్వహిస్తుంది. గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో తాము నిర్వహిస్తున్న ఈ ప్లీనరీ గురించి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇవాళ ఆయన 10 టీవీతో మాట్లాడుతూ… ప్లీనరీలో విజయమ్మ ప్రసంగం ఉంటుందని చెప్పారు. విజయమ్మ వేదికపై ఆమె నిర్ణయాన్ని చెబుతారని అన్నారు.
Nandyal: అతిసారతో ఒకరి మృతి.. మరో అరుగురికి ఆసుపత్రిలో చికిత్స
మూడేళ్ళ పాలనలో ఏమి చేశామో చెప్పడంతో పాటు.. వచ్చే రెండేళ్లు ఏం చేస్తామో తాము చెబుతామని సజ్జల అన్నారు. తమ ప్లీనరీని బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నామని.. తాము చేయగలిగేది ప్రజలకు చెబుతామని ఆయన తెలిపారు. నియమావళిలో చాలా మార్పులు ఉంటాయని, అవన్నీ వేదికపైనే చెబుతానని అన్నారు. కాగా, చాలా కాలం తర్వాత విజయమ్మ వైసీపీ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఆమె రాజీనామా చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.