Pheasant Pigeon: అంతరించిపోయింది అనుకున్న ఏదైనా జీవి మళ్లీ కనిపించడం చాలా అరుదు. అలాంటి అరుదైన సంఘటన తాజాగా చోటు చేసుకుంది. శాస్త్రవేత్తలు దాదాపు 140 సంవత్సరాల క్రితమే కనుమరుగైపోయింది అనుకున్న ఒక అరుదైన పక్షి ఇటీవల మళ్లీ కనిపించింది. ఇదో నెమలిలాంటి పావురం. కానీ, సాధారణ పావురంలా ఉండదు.
Suryakumar Yadav: సెంచరీతో చెలరేగిన సూర్య కుమార్.. న్యూజిలాండ్‌పై 65 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం
ఒక కోడి సైజులో చాలా పెద్దగా ఉంటుంది. ఇది నలుపు, బంగారు రంగులో ఉంటుంది. దీని తోక నెమలిలా చాలా పెద్దగా ఉంటుంది. ఈ పక్షి ఇటీవల పరిశోధకులకు పపూవా న్యూ గినియాలోని అడవుల్లో కనిపించింది. ఈ పక్షి 140 సంవత్సరాల తర్వాత మళ్లీ కనిపించడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పక్షికి సంబంధించిన వీడియోను పరిశోధకులు చిత్రీకరించారు. దాదాపు నెల రోజులు శ్రమించి గత సెప్టెంబర్‌లో ఈ వీడియో తీశారు నిపుణులు.
శతాబ్దానికి ముందు అంతరించిన అరుదైన 20 పక్షి జాతుల్లో ఈ పావురం కూడా ఉంది. 1882 తర్వాత నుంచి ఈ పక్షి కనిపించలేదు. ప్రస్తుతం ఈ పక్షికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.
During the final hours of an expedition searching for the Black-naped Pheasant-pigeon, camera traps captured photos and video of the bird, which had been long-lost to science for 140 years. #LostBirds https://t.co/701DV3Dokn pic.twitter.com/Qs715l6Cys
— Re:wild (@rewild) November 17, 2022