Viral Video: సఫారి వాహనంలోకి ఎగిరి దూకిన సింహం.. సందర్శకులకు సరికొత్త అనుభూతి.. ఇంతకీ సింహం ఏం చేసిందంటే
అడవికి రాజైన సింహం ఒక్కసారిగా వచ్చి మీద పడిపోతే.. ఇంకేమైనా ఉందా? ఒక్కసారిగా నిశ్చేష్టులవ్వాల్సిందే. ఇటీవల కొందరు సందర్శకుల వాహనంపైకి వేగంగా దూసుకొచ్చి దూకిందో సింహం.
- Narender Thiru
- Published On : November 12, 2022 / 06:11 PM IST
Viral Video: సఫారికి వెళ్లి అడవి జంతువులను దగ్గరి నుంచి చూడటమంటే సందర్శకులకు మంచి అనుభూతినిస్తుంది. సఫారి వాహనంలో తిరుగుతూ, వాటిని దగ్గరి నుంచి చూడటం ఎవరికైనా థ్రిల్ కలిగిస్తుంది. కానీ, అదే జంతువు వాహనం మీదికి దూకితే.
అందులోనూ సింహం వచ్చి వాహనం లోపలికి దూకితే! గుండెలు అదిరిపోతాయి కదూ! నిజంగానే అలాంటి అనుభూతే ఎదురైంది కొందరు సందర్శకులకు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలీదు కానీ.. నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. సఫారి చేయడానికి వెళ్లిన టూరిస్టుల వాహనంపైకి దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి దూకిందో సింహం. ఒక్కసారిగి వాహనంలోని వారిపైకి దూసుకెళ్లింది. అయితే, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టలేదు.
ప్రయాణికులు అందరిపైకి దూకుతూ.. కాస్సేపటి తర్వాత వెళ్లిపోయింది. ఈ దృశ్యాన్ని సఫారి వాహనంలో కూర్చున్న వ్యక్తి వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
New wildlife experience ? pic.twitter.com/1J74oTKgWW
— OddIy Terrifying (@OTerrifying) November 8, 2022
