Virat Kohli
Virat Kohli: భారత్-ఇంగ్లండ్ మధ్య మంగళవారం జరిగే తొలి వన్డేకు టీమిండియా బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ దూరమవుతున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో తాజాగా జరిగిన మూడో టీ20లో కోహ్లీ తొడ పైభాగంలో గాయమైంది. ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో గాయం అయిందా? లేదా బ్యాటింగ్ చేస్తోన్న సమయంలోనా? అన్న విషయంపై స్పష్టతలేదు. అతడు గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్‌కు కూడా హాజరుకాలేదు.
salt: అదనంగా ఉప్పు తీసుకునే వారికి అకాల మరణ ముప్పు
దీంతో రేపటి వన్డే ఆడే అవకాశాలు అంతగా లేవు. కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ నెల 14న జరిగే రెండో వన్డే, 17న జరిగే మూడో వన్డేలో మాత్రం కోహ్లీ ఆడే అవకాశాలు ఉన్నాయి. కాగా, భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌లో రెండింటిలో గెలిచి కప్ గెలుచుకుంది. వన్డే సిరీస్ రేపు సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానుంది.