Vizag Steel Pant: 500వ రోజుకు చేరిన విశాఖ ఉక్కు ఉద్యమం

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిచాయి. 32 మంది బలిదానంతో ఆనాడు విశాఖ ఫ్యాక్టరీ సాధించాం. ఇప్పుడు ఒక్క కలం పోటుతో ఫ్యాక్టరీని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. ఏపీ సీఎం వై.ఎస్.జగన్ ప్రతి అంశంలో బీజేపీకి మద్దతు ఇస్తున్నారు.

Vizag Steel Pant: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం 500వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విజయవాడలోని దాసరి భవన్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. ‘‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిచాయి. 32 మంది బలిదానంతో ఆనాడు విశాఖ ఫ్యాక్టరీ సాధించాం. ఇప్పుడు ఒక్క కలం పోటుతో ఫ్యాక్టరీని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. ఏపీ సీఎం వై.ఎస్.జగన్ ప్రతి అంశంలో బీజేపీకి మద్దతు ఇస్తున్నారు.

medical students: ఢిల్లీలో ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థుల ఆందోళన

విశాఖ ఉక్కు విషయంలో ముఖ్యమంత్రి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు. అసలు ఫ్యాక్టరీని అమ్మేది ఎవరు? కొనేది ఎవరు? విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగేంతవరకు పోరాటం కొనసాగుతుంది. జూలై 4న పీఎం పర్యటన సందర్భంగా ఏపీలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతాం. ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తాం’’ అని రామకృష్ణ వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు