medical students: ఢిల్లీలో ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థుల ఆందోళన

పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఉక్రెయిన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా దీక్షలు సాగుతున్నాయి. ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు రష్యా సైనిక దాడి కారణంగా ఇండియా తిరిగొచ్చారు.

medical students: ఢిల్లీలో ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థుల ఆందోళన

Medical Students (1)

medical students: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ తిరిగొచ్చిన భారతీయ వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరాహార దీక్ష చేస్తున్నారు. పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఉక్రెయిన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా దీక్షలు సాగుతున్నాయి. ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు రష్యా సైనిక దాడి కారణంగా ఇండియా తిరిగొచ్చారు. దాదాపు 17,000 మందికిపైగా విద్యార్థులు ఇండియా తిరిగొచ్చారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 1,500 మంది వరకు ఉన్నట్లు అంచనా.

Bandi Sajay: మోదీ సభకు అడ్డంకులు సృష్టిస్తోన్న కేసీఆర్: బండి సంజయ్

ప్రస్తుతం విద్యార్థులు తిరిగి ఉక్రెయిన్ వెళ్లే పరిస్థితులు లేవు. దీంతో తమ భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నారు. చదువు మధ్యలోనే ఆగిపోయిందని బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ఈ ధర్నాలో యూపీ, హరియాణా, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలతోపాటు తెలంగాణకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడారు. ‘‘డాక్టర్ కావాలన్న కలతో ఉక్రెయిన్ వెళ్లాం. కానీ, యుద్ధం కారణంగా చదువు మధ్యలో ఆపేసి తిరిగి వచ్చాం. ప్రస్తుతం ఉక్రెయిన్ వెళ్లే పరిస్థితి లేదు. ఆన్‌లైన్‌లో మెడికల్ విద్య కొనసాగించడం కష్టం. కేంద్ర ప్రభుత్వం దేశంలోని మెడికల్ కాలేజీల్లో ఉక్రెయిన్ విద్యార్థులకు అవకాశం కల్పించి, విద్యార్థుల భవిష్యత్ కాపాడాలి.

Jupally Krishna Rao: ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా వేస్తా: జూపల్లి

ఈ విషయంలో నేషనల్ మెడికల్ కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మమ్మల్ని అడిగి ఉక్రెయిన్‌లో చదువుకోవడానికి వెళ్లారా? అంటున్నారు. మూడు నెలలుగా డిప్రెషన్‌లో ఉన్నాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే మా భవిష్యత్ వృథా అవుతుంది. రైళ్లు తగలబెడితే, ఆస్తులు ధ్వంసం చేస్తేనే మమ్మల్ని పట్టించుకుంటారా? శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం. మా డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి’’ అని వైద్య విద్యార్థులు అన్నారు. ఇండియాలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చదువుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.