Jupally Krishna Rao: ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా వేస్తా: జూపల్లి

ఇరువురూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇద్దరూ బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసురుకున్నారు. దీనిపై జూపల్లి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘నేను అంబేద్కర్ చౌరస్తాలో చర్చ పెడదామని చెప్పాను. కానీ, చర్చకు ఇంటికే వస్తానని చెబితే స్వాగతం పలుకుతాను అన్నాను.

Jupally Krishna Rao: ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా వేస్తా: జూపల్లి

Jupally Krishna Rao

Jupally Krishna Rao: తనపై నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డిపై అవసరమైతే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు జూపల్లి కృష్ణారావు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Telangana: కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ నేత‌ వడ్డేపల్లి రవి.. అద్దంకి దయాకర్ అభ్యంతరం

ఇరువురూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇద్దరూ బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసురుకున్నారు. దీనిపై జూపల్లి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘నేను అంబేద్కర్ చౌరస్తాలో చర్చ పెడదామని చెప్పాను. కానీ, చర్చకు ఇంటికే వస్తానని చెబితే స్వాగతం పలుకుతాను అన్నాను. మీ (ఎమ్మెల్యే) మాట ప్రకారమే రాత్రి నుంచి ఎదురు చూస్తున్నా. కానీ, ఎమ్మెల్యే రాలేదు. అరెస్టై తప్పించుకుపోయాడు. ముఖం చాటేసుకున్న ఎమ్మెల్యే మాట మార్చాడు. నేను మాట మార్చలేదు. మూడున్నరేళ్లుగా ఎమ్మెల్యే ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైంది. హుస్సేన్ సాగర్ కారు ప్రమాదం, ఫ్రుడెన్షియల్ బ్యాంకు వ్యవహరాలపై ఎమ్మెల్యే అవాస్తవాలు మాట్లాడుతున్నాడు.

Kiara Advani : రిలేషన్‌షిప్‌ లో ఎలా ఉండాలో చెప్తున్న కియారా అద్వానీ..

అప్పు తీసుకుని వ్యాపారం చేశాం. ఇది తప్పు అన్నట్టుగా మాట్లాడితే ఎలా? తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయొద్దని సహచర మంత్రులే సూచించినా నేను వెనక్కి తగ్గలేదు. మిగతా మంత్రులపై ఒత్తిడి వస్తుందని వద్దన్నారు. వెయ్యి కోట్లిచ్చినా అమ్ముడుపోయే వ్యక్తిని కాను. నాది మచ్చలేని చరిత్ర. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మీద కేసు వేసిందెవరు?’’ అని జూపల్లి వ్యాఖ్యానించారు.