Telangana: కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ నేత‌ వడ్డేపల్లి రవి.. అద్దంకి దయాకర్ అభ్యంతరం

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి టీఆర్ఎస్ నేత డాక్టర్ వ‌డ్డేప‌ల్లి రవి, ఇతర నేతలు కాంగ్రెస్‌లో చేరారు. అయితే, వడ్డేపల్లి రవిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆ పార్టీ నేత‌ అద్దంకి దయాకర్ అభ్యంతరాలు తెలిపారు.

Telangana:   కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ నేత‌ వడ్డేపల్లి రవి.. అద్దంకి దయాకర్ అభ్యంతరం

Addanki Dayakar

Telangana: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి టీఆర్ఎస్ నేత డాక్టర్ వ‌డ్డేప‌ల్లి రవి, ఇతర నేతలు కాంగ్రెస్‌లో చేరారు. అయితే, వడ్డేపల్లి రవిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆ పార్టీ నేత‌ అద్దంకి దయాకర్ అభ్యంతరాలు తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్‌కు ఫిర్యాదు చేశారు. 2018 ఎన్నికల్లో రెబల్‌గా పోటీ చేసిన రవిని ఆరేళ్ళ‌పాటు పీసీసీ స‌స్పెండ్ చేసింద‌ని ఆయ‌న అన్నారు.

Maharashtra: ఇంకా ఎంత కాలం దాక్కుంటారు: రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు సంజ‌య్ రౌత్ ప్ర‌శ్న‌

ఇప్పుడు ఆయ‌నను పార్టీలో ఎలా చేర్చుకుంటార‌ని ఆయ‌న నిల‌దీశారు. వ‌డ్డేప‌ల్లి ర‌వి పార్టీలో చేరిన తర్వాత రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆయన ఇంటికి ర‌వి వెళ్ళారు. అయితే, ర‌విని కలిసేందుకు రేవంత్ రెడ్డి ఇష్ట‌ప‌డలేదు. మ‌రో రోజు కలుద్దామని తన మనుషులతో చెప్పి పంపారు. కాగా, వ‌డ్డేప‌ల్లి రవి, ఇతర నేతలను హైద‌రాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకున్న అనంత‌రం కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆధ్వానంగా ఉంద‌ని అన్నారు. రైతుల నుంచి పంటను కొనే పరిస్థితి లేదని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలు అని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌ల క‌ష్టాలు తొల‌గేందుకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావ‌డం అవసరమ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

Maharashtra: ప‌త‌నం అంచున ‘మ‌హా’ స‌ర్కారు.. శరద్ పవార్ నివాసంలో కీలక భేటీ

మందు సీసాలు అమ్మి ఆదాయం సమకూర్చుకునే పరిస్థితి టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి ఏర్పడిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమ‌ర్శించారు. సీఎం కేసీఆర్‌కు ప్ర‌జ‌ల‌ సమస్యలు పట్టవని, మూడోసారి గెలుపు కోసం రాజకీయ కుయుక్తులు పన్నుతున్నారని చెప్పారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ లాంటి పథకాలతో వైఎస్సార్ గ‌తంలో రెండోసారి అధికారంలోకి వ‌చ్చార‌ని అన్నారు. ఇప్పుడు ఏపీలో వైఎస్ జగన్ పాలన చాలా బాగుందని, కరోనా స‌మ‌యంలో బాగా పనిచేశార‌ని చెప్పారు .ఆరోగ్య శ్రీ ఏపీలో బాగా పనిచేస్తోంద‌ని అన్నారు.