Maharashtra: ప‌త‌నం అంచున ‘మ‌హా’ స‌ర్కారు.. శరద్ పవార్ నివాసంలో కీలక భేటీ

మహరాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు శివ‌సేన రెబల్ నేత‌, మంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మ‌రోవైపు, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ప‌త‌నం అంచున ఉండ‌డంతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ త‌న‌ నివాసంలో కీలక స‌మావేశం ఏర్పాటు చేశారు.

Maharashtra: ప‌త‌నం అంచున ‘మ‌హా’ స‌ర్కారు.. శరద్ పవార్ నివాసంలో కీలక భేటీ

Ncp Chief Sharad Pawar

Maharashtra: మహరాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు శివ‌సేన రెబల్ నేత‌, మంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మ‌రోవైపు, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ప‌త‌నం అంచున ఉండ‌డంతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ త‌న‌ నివాసంలో కీలక స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి శివసేన నేత అనిల్ దేశాయ్, కాంగ్రెస్ ముఖ్య‌ నేతలు హాజ‌ర‌య్యారు.

Maharashtra: బీజేపీ నేత‌ల‌తో ఏక్‌నాథ్ షిండే భేటీ.. ప్ర‌భుత్వ ఏర్పాటుపై చ‌ర్చ‌లు

మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపై చర్చలు జ‌రుపుతున్నారు. అలాగే, నేటి మ‌ధ్యాహ్నం 12 గంటలకు రెబల్ ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్ షిండే సమావేశం కానున్నారు. డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులు పంప‌డంతో భవిష్యత్ కార్యాచరణపై రెబల్ ఎమ్మెల్యేలు జ‌ర‌పనున్నారు. కొవిడ్ నుంచి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కోలుకున్నారు. నేడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంద‌ని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.

Maharashtra: మ‌హారాష్ట్ర ఎమ్మెల్యేల హోట‌ల్ బిల్ మేము క‌ట్టం: అసోం సీఎం

కాగా, శివసేన థానే జిల్లా చీఫ్ పదవికి నరేష్ మహస్కే రాజీనామా చేసి సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రేకు మ‌రో షాక్ ఇచ్చారు. ఏక్‌నాథ్ షిండేకు మద్దతుగా థానే జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా నరేష్ మహస్కే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. శివసైనికుడిగా కొనసాగుతానంటూ ఉద్ధవ్‌కు రాజీనామా లేఖ పంపారు. ఎన్సీపీ వల్ల కార్యకర్తలు, పార్టీ నేతలు ఇబ్బందులు పడుతున్నారని రాజీనామా లేఖలో పేర్కొన్నారు.