Bandi Sajay: మోదీ సభకు అడ్డంకులు సృష్టిస్తోన్న కేసీఆర్: బండి సంజయ్

ప్రధాని సభతో తెలంగాణలో చరిత్ర సృష్టిస్తాం. ఈ సభకు కేసీఆర్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తోంది. తెలంగాణపై బీజేపీ పాలసీని మోదీ ఈ సభ ద్వారా ప్రకటించబోతున్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. తుక్కుగూడలో జరిగిన అమిత్ షా సభను మించి ప్రధాని మోదీ సభ ఉంటుంది.

Bandi Sajay: మోదీ సభకు అడ్డంకులు సృష్టిస్తోన్న కేసీఆర్: బండి సంజయ్

Bandi Sanjay

Updated On : June 26, 2022 / 2:48 PM IST

Bandi Sajay: వచ్చే నెలలో తెలంగాణలో జరగబోయే ప్రధాని మోదీ సభకు కేసీఆర్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్, పరేడ్ గ్రౌండ్స్‌లో మోదీ నిర్వహించబోయే సభా ప్రాంగణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

Jupally Krishna Rao: ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా వేస్తా: జూపల్లి

‘‘ప్రధాని సభతో తెలంగాణలో చరిత్ర సృష్టిస్తాం. ఈ సభకు కేసీఆర్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తోంది. తెలంగాణపై బీజేపీ పాలసీని మోదీ ఈ సభ ద్వారా ప్రకటించబోతున్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. తుక్కుగూడలో జరిగిన అమిత్ షా సభను మించి ప్రధాని మోదీ సభ ఉంటుంది. బీజేపీ దృష్టిలో కేసీఆర్ గోరంతే. తెలంగాణకు పులి వస్తోంది. సీఎం కేసీఆర్ రాష్ట్రం విడిచి పారిపోవడం ఖాయం. కల్వకుంట్ల రాజకీయాన్ని తెరమరుగు చేసే సమర్ధత బీజేపీకి మాత్రమే ఉంది. తెలంగాణలో బీజేపీని కట్టడి చేయడానికి కేసీఆర్ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసుకున్నాడు. మోదీ సభ రోజు పది లక్షల మందితో హైదరాబాద్ కాషాయ మయం అవుతుంది.

Kiara Advani : రిలేషన్‌షిప్‌ లో ఎలా ఉండాలో చెప్తున్న కియారా అద్వానీ..

ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎదుర్కోవడానికి బీజేపీ సిద్దం. తెలంగాణలో పేదలు జీవించలేని పరిస్థితిని కేసీఆర్ కల్పించారు. మోదీ సభ కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. గరికపాటి మోహనరావు ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.