Whatsapp : వాట్సాప్‌లో ఇక ఫుల్ మూవీ పంపుకోవచ్చు.. ఇలా చెక్ చేసుకోండి..!

WhatsApp 2GB media : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్ లో ఇకపై పెద్ద ఫైల్స్ కూడా సులభంగా పంపుకోవచ్చు. అంటే.. ఒక సినిమా వీడియో మొత్తాన్ని ఒకే ఫైల్లో పంపుకోవచ్చు.

WhatsApp 2GB media : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్ లో ఇకపై పెద్ద ఫైల్స్ కూడా సులభంగా పంపుకోవచ్చు. అంటే.. ఒక సినిమా వీడియో మొత్తాన్ని ఒకే ఫైల్లో పంపుకోవచ్చు. ఇప్పటివరకూ పెద్ద సైజు ఫైల్స్ వీడియోలను పంపుకునే వీల్లేదు. ఎందుకంటే.. కేవలం 100MB వరకు మాత్రమే ఫైల్స్ పంపుకోనే వీలుంది. ఇకపై ఆ సమస్య ఉండదు. వాట్సాప్ తమ యూజర్ల కోసం ఫైల్ సైజు పరిమితిని పెంచేసింది. 100MB నుంచి 2GB వరకు పెంచేసింది. ఒక సినిమా ఫుల్ వీడియో సైజు ఫైళ్లను కూడా ఈజీగా ఒకరి నుంచి మరొకరికి షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ ప్లాట్ ఫాంపై ఏదైనా ఫొటోలు లేదా వీడియోలను 2GB ఫైల్ సైజు వరకు పంపుకోవచ్చు అనమాట.

2GB వ‌ర‌కు ఫైల్స్‌ను పంపుకోవచ్చునే విషయాన్ని ఈ ఏడాది మార్చిలోనే వాట్సాప్ ప్ర‌క‌టించింది. ఇప్పుడా ఈ ఫీచ‌ర్‌ను అర్జెంటీనాలో ప్రవేశపెట్టి వాట్సాప్ ప్ర‌యోగాత్మ‌కంగా టెస్టింగ్ చేసింది. లేటెస్టుగా ఈ ఫీచ‌ర్‌ను ఇత‌ర దేశాల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ యూజ‌ర్లు ఎవ‌రైనా 2GB వరకు ఫైల్స్ ఏమైనా పంపుకోవచ్చు. వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా అందరి యూజర్లకు అందుబాటులోకి తీసుకురాలేదు. ముందుగా కొంత‌మంది యూజ‌ర్లు మాత్ర‌మే ఈ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెగ్యులర్ వాట్సాప్ యూజ‌ర్ల‌ందరికి త్వ‌ర‌లోనే ఈ కొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు మెసేజింగ్ కంపెనీ ప్లాన్ చేస్తోంది.

Whatsapp 2gb Media File Sharing Arrives To More Users Today 

ఈ ఫీచ‌ర్ పనిచేస్తుందో చెక్ చేయండిలా :
100MB కన్నా ఎక్కువ ఫైల్స్‌ను షేర్ చేసుకోవచ్చు. ఈ ఆఫ్షన్ మీకు వచ్చిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు. మీ వాట్సాప్ ఓపెన్ చేయండి. ఏదైనా ఒక కాంటాక్ట్ నంబ‌ర్‌కు 100MB కన్నా ఎక్కువ సైజ్ వీడియోను డాక్యుమెంట్ రూపంలో పంపండి. అప్పుడు ఆ వీడియో అప్‌లోడ్ చేయండి. అది అప్‌లోడ్ అయితే ఈ ఫీచ‌ర్ మీకు అందుబాటులోకి వచ్చినట్టే.. లేదంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.

Read Also : WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఆ మెసేజ్‌లన్నీ ఒకేచోట చదవొచ్చు..!

ట్రెండింగ్ వార్తలు