WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఆ మెసేజ్‌లన్నీ ఒకేచోట చదవొచ్చు..!

WhatsApp : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.

WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఆ మెసేజ్‌లన్నీ ఒకేచోట చదవొచ్చు..!

Whatsapp Spotted Working On Unread Chat Filter For Desktop Version Of The App (1)

WhatsApp : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్ డెస్క్‌టాప్ బీటా వెర్షన్ 2.2221.1లో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. Unread Chat Filter ఫీచర్.. ఈ కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు చదవని చాట్ మెసేజ్ లను ఒకేచోట చదువుకోవచ్చు. చాట్ ఫీల్టర్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత యూజర్ చూడని చాట్ మెసేజ్ లన్నీ ఒకేచోట హైలెట్ గా కనిపిస్తాయి. మీరు ఒకసారి ఆ చాట్ మెసేజ్ క్లిక్ చేసిన తర్వాత సాధారణ చాట్‌లోకి చేరిపోతాయి. ప్రస్తుతం ఈ అన్ రీడ్ చాట్ ఫీల్టర్ ఫీచర్ కోసం వాట్సాప్ పనిచేస్తోందని నివేదిక వెల్లడించింది. సెర్చ్ బాక్సు పక్కన ఫిల్టర్ బటన్ చూడవచ్చు. పంపిన మెసేజ్‌లో ఏమైనా తప్పులుంటే ఎడిట్ చేసుకునేలా ఎడిట్ మెసేజ్ ఫీచర్ తీసుకొస్తోంది.

ఈ ఎడిట్ బటన్ ను వాట్సాప్ టెస్టింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది. XDA డెవలపర్ల ప్రకారం.. WhatsApp డెస్క్‌టాప్ యూజర్ల కోసం కొత్త చాట్ ఫిల్టర్‌పై పనిచేస్తోంది. వెబ్‌సైట్ వెర్షన్ 2.2221.1లో WhatsApp డెస్క్‌టాప్ బీటా యూజర్లకు ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులో ఉంది. XDA ద్వారా షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం.. సెర్చ్ బాక్సు పక్కన ఫిల్టర్ బటన్ కూడా కనిపిస్తుంది. మీరు ఏదైనా ఫిల్టర్‌ను సెలెక్ట్ చేసినప్పుడు.. WhatsApp  చదివిన అన్ని చాట్‌లను హైడ్ చేస్తుంది.

Whatsapp Spotted Working On Unread Chat Filter For Desktop Version Of The App

Whatsapp Spotted Working On Unread Chat Filter For Desktop Version Of The App

మీరు చూడని చాట్‌లను మాత్రమే హైలెట్ చేసి చూపిస్తుంది. మీరు చదవని చాట్‌లన్నింటినీ చదివిన తర్వాత ఫిల్టర్‌ను క్లియర్ చేయొచ్చు. రియల్ వ్యూ వాట్సాప్ కోసం ఈ బటన్‌ను ఉపయోగించవచ్చు. రోజువారీగా అధిక సంఖ్యలో మెసేజ్‌లు వచ్చే వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్‌ ద్వారా చదవని మెసేజ్ లను సులభంగా చూడవచ్చు. ప్రస్తుత అందుబాటులోని సెటప్ ఆప్షన్ ద్వారా యూజర్లు ఏదైనా మెసేజ్‌లను డిలీట్ చేయడానికి మాత్రమే అనుమతిస్తుంది.

Read Also : WhatsApp : ఏప్రిల్‌లో 16లక్షలకుపైగా భారతీయ వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. కారణం ఇదే..!