WhatsApp : ఏప్రిల్‌లో 16లక్షలకుపైగా భారతీయ వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. కారణం ఇదే..!

వాట్సాప్ ఏప్రిల్‌లో 16 లక్షలకు పైగా భారతీయ అకౌంట్లను నిషేధించింది. ఎందుకంటే.. ఈ వాట్సాప్ అకౌంట్లన్నీ ప్లాట్‌ఫారమ్ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే కారణమని నివేదిక వెల్లడించింది.

WhatsApp : ఏప్రిల్‌లో 16లక్షలకుపైగా భారతీయ వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. కారణం ఇదే..!

Whatsapp Banned Over 16 Lakh Indian Accounts In April For Violating Guidelines (1)

WhatsApp Ban : మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ (WhatsApp) ఏప్రిల్ నెలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 ప్రకారం.. నెలవారీ నివేదికను రిలీజ్ చేసింది. ఈ కొత్త నివేదికలో వాట్సాప్ ఏప్రిల్‌లో 16 లక్షలకు పైగా భారతీయ అకౌంట్లను నిషేధించింది. ఎందుకంటే.. ఈ వాట్సాప్ అకౌంట్లన్నీ ప్లాట్‌ఫారమ్ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే కారణమని నివేదిక వెల్లడించింది.

ఏప్రిల్ 1, 2022 నుంచి 30 ఏప్రిల్ 2022 వరకు డేటాను విశ్లేషించింది. దీనిపై WhatsApp ప్రతినిధి మాట్లాడుతూ.. వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీసుల్లో దుర్వినియోగాన్ని కంట్రోలింగ్ చేయడంలో మెసేజింగ్ ప్లాట్ ఫాం అగ్రగామిగా ఉంది. కొన్ని ఏళ్లుగా తమ ప్లాట్‌ఫారమ్‌లో వాట్సాప్ యూజర్ల ప్రైవసీని సురక్షితంగా ఉంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక సాంకేతికత, డేటా సైంటిస్టులు, నిపుణులపై స్థిరమైన ఇన్వెస్టమెంట్ చేస్తూనే ఉన్నామని తెలిపారు.

IT రూల్స్ 2021 ప్రకారం.. ఏప్రిల్ 2022 నెలలో నివేదికను ప్రకటించామన్నారు. యూజర్-సెక్యూరిటీ నివేదికలో స్వీకరించిన యూజర్ల ఫిర్యాదులు WhatsApp ద్వారా కంపెనీ నివారణ చర్యలు చేపట్టింది. WhatsApp ఏప్రిల్ నెలలో 1.6 మిలియన్లకు పైగా అకౌంట్లను నిషేధించిందని వాట్సాప్ ప్రతినిధి తెలిపారు.

Whatsapp Banned Over 16 Lakh Indian Accounts In April For Violating Guidelines

Whatsapp Banned Over 16 Lakh Indian Accounts In April For Violating Guidelines

వాట్సాప్ సాధారణంగా కంపెనీ విధానాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు అకౌంట్లను నిషేధిస్తుంది. తప్పుడు సమాచారాన్ని షేర్ చేయడంతో పాటు ధృవీకరించని మెసేజ్‌లను వాట్సాప్ గ్రూపుల్లోకి ఫార్వార్డ్ చేయడం చేస్తున్నవారిపై వాట్సాప్ నిఘా పెట్టింది. WhatsApp అకౌంట్లను నిషేధించే ప్లాట్‌ఫారమ్‌లో ఫేక్ న్యూస్ వ్యాప్తిని ఎదుర్కోవడానికి, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఔట్ సోర్స్ లింక్‌లను ధృవీకరిస్తోంది.

తమ ప్లాట్‌ఫారమ్ అనేకసార్లు ఫార్వార్డ్ చేసిన మెసేజ్‌లపై నిఘా పెట్టింది. ఇలా ఎక్కువ ఫార్వాడ్ చేసిన వాట్సాప్ అకౌంట్లలో ఫేక్ అని తేలింది. వాట్సాప్ నిబంధనల్లో దుర్వినియోగాన్ని ఇలా గుర్తించనున్నారు. వాట్సాప్ అకౌంట్ పై నిఘా మూడు దశల్లో జరుగుతుంది. ముందుగా రిజిస్ట్రేషన్, ఆ తర్వాత మెసేజ్ పంపే సమయంలో, మెసేజ్‌లపై రియాక్షన్స్, వాట్సాప్ యూజర్ల కంప్లయింట్స్ రిపోర్టులను బ్లాక్‌ల రూపంలో అందుకుంటామని కంపెనీ నివేదికలో పేర్కొంది.

Read Also : WhatsApp: మెసేజ్ పంపాక కూడా ఎడిట్ చేసుకునే ఆప్షన్..