Monkeypox
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అప్రమత్తమైంది. ఈ వ్యాధిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటిస్తూ శనివారం సాయంత్రం నిర్ణయం తీసుకుంది. మంకీపాక్స్ కేసులపై డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ కమిటీ రెండోసారి సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.
The National Flag: జాతీయ జెండా కోడ్‌లో మార్పులు.. ఇకపై రాత్రి పూట కూడా జెండా ఎగరొచ్చా?
దీని ప్రకారం ప్రపంచంలోని అన్ని దేశాలు మంకీపాక్స్ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటివరకు ఇండియాతో కలిపి దాదాపు 75 దేశాల్లో 16,000కు పైగా కేసులు నమోదయ్యాయి. మన దేశంలో కేరళలో రెండు మంకీపాక్స్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనాతోపాటు, పోలియోపై మాత్రమే డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇప్పుడు మంకీపాక్స్ మూడోది. ఇటీవలి కాలంలో పోలియో కేసులు కూడా బయపడుతుండటంతో దీనిపై కూడా డబ్ల్యూహెచ్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
India’s population: 41 కోట్లు తగ్గనున్న భారత జనాభా
ఇది ప్రాణాంతకం కాదు. అయినప్పటికీ వ్యాధి తీవ్రతనుబట్టి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. మంకీపాక్స్ వల్ల ఇప్పటివరకు ఐదుగురు మరణించినట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.