The National Flag: జాతీయ జెండా కోడ్‌లో మార్పులు.. ఇకపై రాత్రి పూట కూడా జెండా ఎగరొచ్చా?

వచ్చే నెలలో దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ప్రతి ఇంటిపై మూడు రోజులపాటు జాతీయ జెండా ఎగరేయాలి. ఈ నేపథ్యంలో కేంద్రం కొన్ని మార్పులు చేసింది.

The National Flag: జాతీయ జెండా కోడ్‌లో మార్పులు.. ఇకపై రాత్రి పూట కూడా జెండా ఎగరొచ్చా?

The National Flag

The National Flag: సూర్యోదయం తర్వాత ఎగరేసిన జాతీయ జెండాను సూర్యాస్తమయంలోపు తొలగించాలనే నిబంధన గురించి తెలిసిందే. ఇప్పటివరకు జాతీయ జెండా కోడ్‌లో ఉన్న ఈ రూల్ ఇకపై మారబోతుంది. జాతీయ జెండా కోడ్‌లో కేంద్రం తాజాగా కొన్ని మార్పులు చేసింది. దీని ప్రకారం ఇకపై పగలు మాత్రమే కాకుండా రాత్రిపూట కూడా జాతీయ జెండా ఎగరొచ్చు.

Woman Gang-Raped: ఫంక్షన్ కోసం పిలిచి మహిళపై రైల్వే సిబ్బంది అత్యాచారం

వచ్చే నెల 13, 14, 15 తేదీల్లో దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత మహోత్సవ్’ పేరిట కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించింది. దీనిలో భాగంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయడమే ఈ కార్యక్రమం. మూడు రోజులపాటు జాతీయ జెండా ఎగరేయాలి. అయితే గతంలో ఉన్న నిబంధన ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే జెండాను ఎగరేయొచ్చు. రోజంతా ఎలాంటి వాతావరణం ఉన్నా జాతీయ జెండా ఎగరొచ్చు. తర్వాత సాయంత్రం నిబంధనలు పాటిస్తూ జెండాను తొలగించాల్సి ఉంటుంది. అయితే, ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో వరుసగా మూడు రోజులు జాతీయ జెండా ఎగరాల్సి ఉంటుంది.

India’s population: 41 కోట్లు తగ్గనున్న భారత జనాభా

పాత కోడ్ ప్రకారమే అయితే, ప్రతి రోజూ సాయంత్రం జెండాను తొలగించాలి. అందుకే, తాజా కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని జెండా కోడ్‌కు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. తాజా ఆదేశాల ప్రకారం రాత్రి పూట కూడా జాతీయ జెండా ఎగరొచ్చు. అలాగే ఇంతకుముందు మెషీన్లపై తయారైన, పాలిస్టర్ జాతీయ జెండాలు ఎగరేసేందుకు అనుమతి ఉండేది కాదు. కానీ, ఇప్పుడు మెషీన్లపై తయారైన జెండాలను కూడా ఎగరేయొచ్చు. కాటన్, పాలిస్టర్, ఉన్ని, పట్టు, ఖాదీ, చేనేత.. ఇలా వీటిలో దేనితో తయారైన జాతీయ జెండానైనా ఎగరేయొచ్చు.