India’s population: 41 కోట్లు తగ్గనున్న భారత జనాభా

ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతున్న భారత జనాభా రాబోయే కాలంలో భారీగా తగ్గిపోనుందట. మరో 78 ఏళ్లలో దాదాపు 41 కోట్ల జనాభా తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ దేశాల జనాభా కూడా తగ్గుతుందని ఈ నివేదిక తేల్చింది.

India’s population: 41 కోట్లు తగ్గనున్న భారత జనాభా

India’s Population

India’s population: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశం భారత్. త్వరలో చైనాను దాటేసి మొదటి స్థానంలో కూడా నిలిచే అవకాశాలున్నాయని అంచనా. అయితే, విపరీతంగా పెరిగిపోతున్న మన దేశ జనాభా మరికొన్నేళ్లలో తగ్గిపోతుందట. అది కూడా దాదాపు 41 కోట్ల జనాభా తగ్గొచ్చని ఒక నివేదిక వెల్లడించింది. రాబోయే 78 ఏళ్లలో.. అంటే 2100 వరకు దాదాపు 41 కోట్ల మేర జనాభా తగ్గుతుందని స్టాన్‪‌ఫోర్డ్ యూనివర్సిటీ వెల్లడించిన ఒక నివేదికలో తేలింది.

Smriti Irani: ‘గాంధీ’ కుటుంబం గురించి మాట్లాడినందుకే నా కూతురిపై ఆరోపణలు: స్మృతి ఇరానీ

ఈ నివేదిక ప్రకారం.. జనాభా విపరీతంగా పెరిగిపోయినప్పుడు వనరులు భారీగా తగ్గిపోతాయి. దీనివల్ల జీవన ప్రమాణాలు తగ్గుతాయి. అంతిమంగా జనాభా తగ్గుదల మొదలవుతుంది. జనాభాలో మనం చైనా తర్వాత ఉన్నప్పటికీ.. జన సాంద్రతలో మాత్రం మనమే ముందున్నాం. ప్రస్తుతం మన దేశంలో ఒక చదరపు కిలోమీటరుకు సగటున 476 మంది జీవిస్తుంటే, చైనాలో 148 మంది మాత్రమే బతుకుతున్నారు. అదే 2100 వరకు మన దేశంలో చదరపు కిలోమీటరుకు 335 మంది జీవిస్తే, చైనాలో 51 మందే జీవిస్తారు. చదరపు కిలోమీటరుకు అమెరికాలో ప్రస్తుతం సగటున 37 మంది జీవిస్తే, 2100కల్లా 31 మంది, జపాన్‌లో ప్రస్తుతం 329 మంది జీవిస్తే, 2100 నాటికి 133 మంది మాత్రమే జీవిస్తారు. అంటే మన దేశంతోపాటు అన్ని దేశాల్లోనూ జనాభా, జన సాంద్రత విపరీతంగా తగ్గుతుంది.

Woman Gang-Raped: ఫంక్షన్ కోసం పిలిచి మహిళపై రైల్వే సిబ్బంది అత్యాచారం

అయితే మన దేశ జనాభా 2050 వరకు బాగా పెరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుదల మొదలవుతుంది. 2075, 2100కల్లా భారీ స్థాయిలో తగ్గుతుంది. ఇప్పటికి అధికారికంగా జనాభా లెక్కలు మొదలుకానప్పటికీ, ప్రస్తుతం మన దేశ జనాభా 141 కోట్లు ఉన్నట్లు అంచనా. సంతానోత్పత్తి రేటు తగ్గడం కూడా జనాభా తగ్గుదలకు కారణమవుతుంది. దేశంలో ఒక మహిళ సంతానోత్పత్తి రేటు ప్రస్తుతం 1.76గా ఉండగా, 2032 నాటికి 1.39, 2052 నాటికి 1.28, 2082 నాటికి 1.2, 2100 నాటికి 1.19గా ఉండే అవకాశం ఉంది.