Jharkhand CM Challenge To ED : ‘దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి’ అంటూ ఈడీకి ఝార్ఖండ్ సీఎం సవాల్

ED కి జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ సవాల్ విసిరారు. నేను నేరం చేసి ఉంటే విచారణలు ఎందుకు? దమ్ముంటే తనను అరెస్ట్ చేయండి అంటూ సవాల్ విసిరారు. నేను నేరం చేసుంటే జార్ఖండ్ వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండి..జార్ఖండ్ ప్రజలు అంటే మీకు ఎందుకంత భయం అంటూ ప్రశ్నించారు.

Jharkhand CM Hemant Soren Challenge To ED : Enforcement Directorate (ED)కి ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ సవాల్ విసిరారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయండి అంటూ సవాల్ విసిరారు. నేను నేరం చేసుంటే జార్ఖండ్ వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండి..జార్ఖండ్ ప్రజలు అంటే మీకు ఎందుకంత భయం అంటూ ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ స్కామ్ కు సంబంధించి జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. గురువారం (నవంబర్ 3,2022)న విచారణకు రావాలని ఆదేశించింది.

కానీ ఈడీ ఆదేశాలను సీఎం సొరేన్ బేఖాతరు చేశారు. విచారణకు హాజరుకాలేదు. ఈడీ విచారణకు డుమ్మా కొట్టటమే కాకుండా ఎదురు సవాల్ విసిరారు. దీంతో జార్ఖండ్ లోని ఈడీ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈడీ విచారణకు హాజరు కావాల్సిన సొరేన్ ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నేను నిజంగా నేరం చేసి ఉంటే విచారణ కాదు డైరెక్ట్ గా వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చని ఈడీకి సవాల్ విసిరారు సీఎం హేమంత్ సోరేన్.

కాగా..అక్రమ మైనింగ్‌కు సంబంధించి పీఎంఎల్‌ఏ కేసులో నవంబర్ 3న విచారణకు హాజరుకావాలని ఈడీ సీఎం హేమంత్ సోరేన్ కు సమన్లు ​​పంపింది. ఈ కేసులో సోరెన్ సహాయకుడు పంకజ్ మిశ్రాను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. సోరెన్ సహచరుడు పంకజ్ మిశ్రా, అతని వ్యాపార సహచరులతో సంబంధం ఉన్న జార్ఖండ్‌లోని 18 ప్రదేశాలపై దర్యాప్తు సంస్థ జూలై 8న దాడులు నిర్వహించింది.
ప్రస్తుతం జార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్‌ సోరెన్‌ గతంలో గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ టైమ్‌లో కొన్ని లీజుల మంజూరు, సొంతంగా గనులు కేటాయించుకోవడంలో అక్రమాలకు పాల్పడ్డారనేది అభియోగంతో ఈడీ విచారణకు పిలిచింది.

కొన్నాళ్లుగా దీనిపై వివాదం కొనసాగుతుండగానే విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. రాంచీలోని కార్యాలయానికే రావాలని సూచించింది. సీఎం హేమంత్ సోరెన్ నేరుగా విచారణకు రావాల్సిన పరిస్థితుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలంటూ పోలీసులకు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు లేఖ రాశారు. 42 కోట్లకుపైగా ఆస్తుల్ని ఈ మైనింగ్‌ లీజుల ద్వారా అక్రమంగా సంపాదించారంటూ సోరెన్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఐఏఎస్ అధికారితోపాటు సోరెన్ సన్నిహితుల్ని కూడా ఈ కేసులో చిక్కులు ఎదుర్కొంటున్నారు.

ED Notices To Jharkhand CM : జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌కు ఈడీ నోటీసులు..విచారణకు హాజరుకావాలని ఆదేశం

మైనింగ్ ఆరోపణలో సీఎం పదవి నుంచి తప్పిస్తారని ప్రచారం..
ఈ మైనింగ్‌ కేసు హేమంత్‌ మెడకు చట్టుకోవటంతో ఆయన్ను సీఎం పదవి నుంచి తప్పిస్తారంటూ కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్-9A ప్రకారం సీఎం సోరెన్ నిబంధనలను ఉల్లంఘించారని బీజేపీ ఆరోపిస్తోంది. సీఎంగా ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఇదే అంశంపై ఇటీవల బలపరీక్షకు వెళ్లిన సోరెన్ అందులో నెగ్గారు. అయినా ఈ మైనింగ్‌ కేసుతో బీజేపీ ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపణలు ఉన్నాయి.

హేమంత్ సోరేన్ ను సీఎం పదవి నుంచి తప్పింస్తారనే ప్రచారానికి తగినట్లుగానే జార్ఖండ్‌ గవర్నర్‌ రమేష్‌ బైస్‌ కీలక వ్యాఖ్యలు చేస్తూ.. రాష్ట్రంలో ఏ క్షణమైనా ఆటం బాంబ్‌ పేలుతుందని అన్నారు. ఆటంబాబు పేలుతుందని ఆయన అనడం.. వారం రోజులకే ఈడీ నోటీసులు ఇవ్వడం..ఆయన ఈడీ విచారణకు రాకపోవటంతో ఇప్పుడు ఏం జరుగుతుందనే విషయం ఆసక్తిగా మారింది.

ట్రెండింగ్ వార్తలు