ED Notices To Jharkhand CM : జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌కు ఈడీ నోటీసులు..విచారణకు హాజరుకావాలని ఆదేశం

జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీచేసింది. గురువారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. అక్రమ మైనింగ్‌ కుంభకోణం వ్యవహారంలో రేపు విచారణకు హాజరుకావాలని వెల్లడించింది ఈడీ.

ED Notices To Jharkhand CM : జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌కు ఈడీ నోటీసులు..విచారణకు హాజరుకావాలని ఆదేశం

ED Notices To Jharkhand CM

ED Notices To Jharkhand CM : జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీచేసింది. గురువారం (నవంబర్ 3,2022) విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. అక్రమ మైనింగ్‌ కుంభకోణం వ్యవహారంలో రేపు విచారణకు హాజరుకావాలని వెల్లడించింది ఈడీ.

కాగా ఈ అక్రమ మైనింగ్ స్కామ్ కు సంబంధించి సోరెన్‌ సన్నిహితుడు పంకజ్‌ మిశ్రాను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పంకజ్ పై మనీ లాండరింగ్‌ కేసు నమోదుచేశారు అధికారుల. ఈ క్రమంలో గత జూలై 8న జార్ఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. దీంట్లో భాగంగా ఈడీ మిశ్రాతోపాటు అతని బిజినెస్ పార్టనర్ల ఇళ్లు, ఆఫీసుల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 50 బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ.13.32 కోట్ల నగదును సీజ్‌ చేశారు.

గత మే నెలలో సీఎం సోరెన్‌తోపాటు జార్ఖండ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిణి పూజా సింఘాల్‌ ఇంట్లో కూడా ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తనకు తానుగా గనులను కేటాయించుకున్నారని, సీఎం సోరెన్‌ను ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర గవర్నర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.