Pv Sindhu : 130కోట్ల మంది అశ్శీస్సులతో..రాట్నాలమ్మ దీవెనతో….
టోర్నమెంట్‌కు వెళ్లే ముందు రాట్నాలమ్మ ఆశీర్వాదం తీసుకుని సింధు ఆట ఆడేందుకు వెళ్లిందన్నారు. అమ్మ దయతో దేశానికి గొప్ప పేరు తీసుకువచ్చిందన్నారు.
- Guntupalli Ramakrishna
- Published On : August 2, 2021 / 03:35 PM IST
Pv Sindhu
Pv Sindhu : 130 కోట్ల భారతీయుల ఆశీస్సులతో పాటు ,రాట్నాలమ్మ దీవెనతో పీవీ సింధు కాంస్య పతకం సాధించిందని గర్వంగా చెప్పారు ఆమె తండ్రి పీవీ వెంకటరమణ. పీవీ సింధు పతకం సాధించిన నేపధ్యంలో ఆమె తండ్రి పీవీ వెంకట రమణ పశ్చిమ గోదావరిజిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలోని రాట్నాలమ్మ అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టోర్నమెంట్‌కు వెళ్లే ముందు రాట్నాలమ్మ ఆశీర్వాదం తీసుకుని సింధు ఆట ఆడేందుకు వెళ్లిందని, అమ్మ దయతో దేశానికి గొప్ప పేరు తీసుకువచ్చిందన్నారు. మా పూర్వీకుల నుంచి మాకుల దేవతగా రాట్నాలమ్మను పూజిస్తున్నామని తెలిపారు. ఒలింపిక్స్ లో ఆడటం గొప్ప అవకాశం..అది అందరికీ రాదని, అమ్మాయిలలో రెండో సారి ఒలింపిక్స్ లో మెడల్ పొందిన వారిలో సింధు మొదటి యువతి కావడం ఆనందంగా ఉందన్నారు.
ఏపి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఒలింపిక్స్ కు పయనమయ్యే ముందు తన కార్యాలయంకు పిలిపించి సింధు, సాత్విక్ ,హాకీ క్రీడాకారులను సన్మానించి, మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ప్రోత్సాహించారని, దేశ ప్రజలంతా సింధూ పతకం సాధించాలని అకాంక్షించారన్నారు వెంకటరమణ. మరోవైపు దేశం గర్వపడేలా చేసినందుకు పరిసరగ్రామాల వాసులంతా పివీ సింధు తండ్రి వెంకటరమణను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
