Woman break dance in saree : చీరకట్టుతో.. హైహీల్స్‌తో బ్రేక్ డ్యాన్స్ ఇరగదీసిన మహిళ వీడియో వైరల్

చీర కట్టుతో సంప్రదాయ నృత్యం చేయడం సులువే.. బ్రేక్ డ్యాన్స్ అదీ హైహీల్స్ వేసుకుని అంటే చాలా కష్టం. బ్యాలెన్స్ చేసుకోలేకపోతే కింద పడటం ఖాయం. కానీ ఓ మహిళ అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులు వేసి అందరిని అబ్బురపరిచింది.

Woman break dance in saree

Viral Video : చీర కడితేనే నడక కష్టం అంటారు కొంతమంది ఆడవారు. చీరకట్టులో డ్యాన్స్ చేయడం.. అదీ హైహీల్స్ వేసుకుని అంటే చాలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓ లేడీ చీరలో, హైహీల్స్‌తో చేసిన డ్యాన్స్ ఇంటర్నెట్‌ని షేక్ చేసింది.

Bengaluru : ఐదుగురి ప్రాణాలు కాపాడటానికి ఆమె చీర తీసి ఇచ్చేసింది .. మహిళ తెగువకు హ్యాట్యాఫ్..

nepalhiphopfoundation01 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో మెస్మరైజ్ చేస్తోంది. ఆడవారు తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించింది. సాధారణంగా చీర కట్టుకుంటే సంప్రదాయమైన డ్యాన్స్‌లు మాత్రమే చేయగలరనే అపోహని ఈ వీడియో బ్రేక్ చేసింది. చీరకట్టులో మోడ్రన్ డ్యాన్సులు కూడా చేయగలరని నిరూపించింది. వీడియోలో డ్యాన్స్ చేస్తున్న మహిళ చిన్న చేతుల బ్లౌజ్ ధరించి పాస్టెల్ చీరలో మెరిసింది. తన ఎథ్నిక్ లుక్‌కి తగ్గట్లు వైట్ పాయింటెడ్ హీల్స్ ధరించింది. ఇక ట్యూన్‌కి తగ్గట్లు ఆమె డ్యాన్స్ చేస్తుంటే చుట్టూ ఉన్నవారంతా చప్పట్లతో మద్దతు పలికారు. ‘సాంప్రదాయ పద్ధతిలో బ్రేక్ డ్యాన్స్.. హీల్స్ మరియు చీరపై అదిరిపోయింది’ అనే శీర్షికతో షేరైన ఈ వీడియో వైరల్ అవుతోంది.

Fighting for sarees : శారీల కోసం సిగపట్లు.. బెంగళూరులో ఇద్దరు మహిళల ఫైటింగ్ వీడియో వైరల్

‘సూపర్ కాన్ఫిడెంట్ మరియు గ్రేట్ డ్యాన్సర్ కూడా.. నేనైతే చీరతో సరిగ్గా నడవలేను’ అని ఒక యూజర్.. ‘చీర మరియు హీల్స్.. అద్భుతమైన అమ్మాయి’ అని మరొకరు.. వరుసగా కామెంట్లు చేశారు. మొత్తానికి చీరతో బ్రేక్ డ్యాన్స్ చేసిన మహిళ కొత్త ట్రెండ్ సెట్ చేసింది.